NITI Aayog Vice-Chairman: ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి
ABN , Publish Date - Feb 09 , 2025 | 05:05 AM
జీవన ప్రమాణాలు మరింతగా మెరుగుపడాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ అన్నారు.

నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ
పాడేరు, అరకులోయ ప్రాంతాల్లో పర్యటన
పాడేరు, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ఆకాంక్ష జిల్లా (అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్)లో ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా మెరుగుపడాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ అన్నారు. శనివారం ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. పాడేరులోని కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ఆకాంక్ష మండలాల అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వైద్య సేవలు, పోషకాహారం, వ్యవసాయం, నీటి పారుదల సదుపాయాలు, ఆర్థిక ఆసరా, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. జిల్లాలో మారేడుమిల్లి, గంగవరం, వై.రామవరం ఆకాంక్ష మండలాల లబ్ధిదారులతో వర్చువల్‌గా మాట్లాడారు. రానున్న ఐదేళ్లలో గిరిజన ప్రాంతంలో పూర్తిస్థాయిలో రహదారుల నిర్మాణానికి కృషిచేస్తామని కలెక్టర్ దినేశ్‌కుమార్ చెప్పారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ బృందం సభ్యులు పార్థసారథిరెడ్డి, ఏఏఎం కుమార్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ్. రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్లు శౌర్యమన్ పటేల్, కల్పశ్రీ ఇతర అధికారులు పాల్గొన్నారు. తర్వాత సుమన్ బేరీ సతీసమేతంగా అరకులోయ సమీపాన గల గిరి గ్రామదర్శినిని సందర్శించారు. గిరిజనుల సంప్రదాయాలు గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు గిరిజన సంప్రదాయ వస్ర్తాలను ధరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..
Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..