Share News

Darshan Scam : వైకుంఠద్వార దర్శనం పేరిట రూ.2 లక్షల వసూలు

ABN , Publish Date - Jan 06 , 2025 | 05:21 AM

వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని భక్తుల నుంచి రూ.2 లక్షలు వసూలు చేసిన ఇద్దరు దళారీలను తిరుమల టూటౌన్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు.

 Darshan Scam : వైకుంఠద్వార దర్శనం పేరిట రూ.2 లక్షల వసూలు

  • ఇద్దరు దళారీలను అరెస్ట్‌ చేసిన తిరుమల పోలీసులు

తిరుమల, జనవరి 5(ఆంధ్రజ్యోతి): వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని భక్తుల నుంచి రూ.2 లక్షలు వసూలు చేసిన ఇద్దరు దళారీలను తిరుమల టూటౌన్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. తిరుపతి జిల్లాకు వడమాలపేటకు చెందిన దినేష్‌, తిరుత్తణికి చెందిన దొరైబాబు భక్తులతో పరిచయాలు పెంచుకుని దర్శనాలు చేయిస్తామని నమ్మించి గత కొంతకాలంగా మోసం చేస్తున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడికి, వారి కుటుంబానికి దర్శనం కల్పిస్తామని నమ్మించి రూ.2లక్షలు వసూలు చేశారు. బాధితులు తిరుమల టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - Jan 06 , 2025 | 05:21 AM