అమెరికా వైఖరి అమానుషం: తులసిరెడ్డి
ABN , Publish Date - Feb 18 , 2025 | 04:57 AM
భారతీయ వలసదారులపట్ల అమెరికా ప్రభుత్వ వైఖరి అమానుషంగా ఉందని, ఈ నెల 5వ తేదీన 104 మందిని సంకెళ్లు, గొలుసులు కట్టి అమెరికా...

వేంపల్లె, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): భారతీయ వలసదారులపట్ల అమెరికా ప్రభుత్వ వైఖరి అమానుషంగా ఉందని, ఈ నెల 5వ తేదీన 104 మందిని సంకెళ్లు, గొలుసులు కట్టి అమెరికా సైనిక రవాణా విమానంలో పశువుల కంటే హీనంగా ఇండియాకు తరలించడం గర్హనీయమని రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. సోమవారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కుంభమేళా వద్ద 31 మంది, ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో 18 మంది తొక్కిసలాటలో చనిపోవడానికి పరోక్షంగా కారణమైన యూపీ సీఎం, కేంద్ర రైల్వే శాఖ మంత్రి రాజజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, రాయలసీమ, ప్రకాశం తదితర జిల్లాల్లో రబీ సీజన్‌లో ప్రధాన పంట బుడ్డ శనగ దిగుబడి గణనీయంగా తగ్గిందన్నారు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వరా కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని, క్వింటాకు రూ.10వేల చొప్పున కొనాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.