Share News

Vallabhaneni Vamsi: వంశీ భార్య కీలక ఆరోపణలు

ABN , Publish Date - Feb 27 , 2025 | 06:26 PM

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ కీలక ఆరోపణలు చేశారు. గత మూడు రోజులుగా తన భర్తను అర్థం పర్దం లేకుండా.. కేసుకు సంబంధం లేని ప్రశ్నలతో విసిగించారని ఆందోళన చెందారు. ఆయనను ఆస్తమా సమస్య ఇబ్బంది పెడుతోన్నదని తెలిపారు.

Vallabhaneni Vamsi: వంశీ భార్య కీలక ఆరోపణలు
vallabhaneni vamsi wife pankaj sri

విజయవాడ, ఫిబ్రవరి 27: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్థన్ కిడ్నాప్ వ్యవహారంలో అరెస్టయి.. జైలులో ఉన్న తన భర్త వల్లభనేని వంశీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన భార్య పంకజ శ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా తన భర్తను అర్థం పర్దం లేకుండా.. కేసుకు సంబంధం లేని ప్రశ్నలతో విసిగించారని ఆందోళన చెందారు. ఆయనను ఆస్తమా సమస్య ఇబ్బంది పెడుతోన్నదని తెలిపారు.

వంశీ పడుతోన్న అనారోగ్య సమస్యలను న్యాయమూర్తి ఎదుట విన్నవించడం జరిగిందన్నారు. అయితే తాను తాత్కాలిక న్యాయమూర్తినని.. రెగ్యులర్‌ న్యాయమూర్తి వచ్చిన తర్వాత మీరు పిటిషన్ వేసుకోవచ్చు అని ఆయన సూచించారని వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీ పేర్కొన్నారు. మూడు రోజులు కోర్టు అనుమతించిన పోలీస్ కస్టడీ తర్వాత మళ్లీ వల్లభనేని వంశీని సబ్ జైలుకు తరలించారన్నారు.

Also Read: గిన్నిస్ రికార్డులు సృష్టించిన మహాకుంభ మేళ


ఇక వంశీ తరఫు న్యాయవాది మాట్లాడుతూ..

కేసుకు సంబంధం లేని ప్రశ్నలకు వంశీని ఇబ్బంది పడుతున్నారని న్యాయవాది తానికొండ చిరంజీవి విమర్శించారు. ఈ కేసులో బలం లేకపోయినా.. అర్థం పర్థం లేని వాదనలు చేస్తున్నారని చెప్పారు. అయితే ఇవి న్యాయస్థానం ముందు నిలిచే కేసులు కావని వంశీ తరఫు న్యాయవాది తెలిపారు. మూడు కాదు పది కేసులు అయినా సరే తాము కోర్టు ద్వారానే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానులేనని ఆయన గుర్తు చేశారు.

Also Read: ప్యూర్ ఈవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్


ఏసీపీ దామోదర్ మాట్లాడుతూ..

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిలో కీలక సాక్షిగా ఉన్న సత్యవర్థన్‌ను బెదిరించి.. భయపెట్టి కేసు తారుమారు చేయాలని చూశారని తెలిపారు. వంశీతోపాటు అతడి అనుచరులు సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్, సాంకేతిక పరమైన ఆధారాలు సేకరించామని చెప్పారు. కోర్టు ఆదేశాలతో మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని వల్లభనేని వంశీని ప్రశ్నించామన్నారు.

Also Read: పీసీ ఘోష్ కమిషన్ విచారణలో ఆసక్తికర సంఘటన


కొన్ని ప్రశ్నలకు అవునని.. మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్నారు. మిస్ అయిన ఫోన్ గురించి అడిగినా తనకు తెలియదంటూ సమాధానమిచ్చారన్నారు. ఇక ఫిబ్రవరి 12వ తేదీన హైదరాబాద్ నుంచి వచ్చి వైఎస్ జగన్‌ను కలిసినట్లు వల్లభనేని వంశీ అంగీకరించారన్నారు. అయితే తమకు ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉందని తెలిపారు.


వల్లభనేని వంశీ కోసం మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ వేస్తామని ఏసీపీ దామోదర్ స్పష్టం చేశారు. జైలులో ఒక బ్యారక్ కాకుండా.. ఇతరులున్న బ్యారక్‌ వంశీ అడిగారన్నారు. ఈ అంశాన్ని జైలర్‌తోపాటు వంశీ కోర్టులో పిటిషన్ వేసి.. విచారణ కోరతాన్నారు. ఈ కేసులో ఇతర ముద్దాయిలను సైతం కస్టడీ కోరుతూ ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశామని ఏసీపీ దామోదర్ తెలిపారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 27 , 2025 | 06:27 PM