Share News

YV Subba Reddy: మా ప్రయత్నం మేం చేస్తుంటే.. మీరు మాత్రం అందుకే పరిమితం అయ్యారు..

ABN , Publish Date - Feb 11 , 2025 | 04:54 PM

టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్ట్, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

YV Subba Reddy: మా ప్రయత్నం మేం చేస్తుంటే.. మీరు మాత్రం అందుకే  పరిమితం అయ్యారు..
YV Subba Reddy

ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధన కోసం రూ. 11, 440 కోట్లు నిధులు ఇవ్వడం బాగానే ఉన్నా.. ఉద్యోగులకు పూర్తిస్థాయిలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రాష్ట్ర సమస్యల్ని కేంద్రం దృష్టికి తెచ్చి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంటే.. టీడీపీ సభ్యులు మాత్రం వైఎస్ఆర్సీపీ మీద ఆరోపణలు చేయడానికే పరిమితం అయ్యారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చినప్పటికీ వాల్తేరు డివిజన్ పూర్తిగా ఇందులో ఉండేలా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.


ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ 45.7 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయాలని తమ ప్రభుత్వ హయాంలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని, అయితే, టీడీపీ అధికారంలోకి వచ్చాక 41.5 మీటర్లకు తగ్గించడమే కాకుండా, సవరించిన అంచనా వ్యయం కూడా తగ్గిందన్నారు. ఎత్తు తగ్గడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు నీరు అందించడం సాధ్యం కాదన్నారు. ఎత్తు తగ్గడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి మొత్తం ప్రాజెక్ట్ ప్రయోజనాలేవీ నెరవేరని పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు.

Updated Date - Feb 11 , 2025 | 04:58 PM