Business Idea: చిన్న మొక్కలు పెంచండి.. నెలకు రూ. 40 వేలకుపైగా సంపాదించండి..
ABN , Publish Date - Jan 19 , 2025 | 06:23 PM
సాధారణంగా పచ్చదనం అంటే ఎవరికైనా కూడా ఇష్టం ఉంటుంది. అయితే మీకు ఆసక్తి ఉంటే చిన్న మొక్కల పెంపకం ద్వారా కూడా వ్యాపారం చేయవచ్చు. ఈ క్రమంలో నెలకు 40 వేల వరకు సంపాదించవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ చూద్దాం.

ప్రస్తుత రోజుల్లో అనేక మంది వారి ఇళ్లల్లో పచ్చదనాన్ని పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో కొత్త మార్గాలను అన్వేషిస్తూ చిన్న మొక్కలు, చెట్లను కొనుగోలు చేసి ఇంట్లో పెంచుకుంటున్నారు. ఇలా మొక్కలు పెంచుకోవడం వల్ల వారి ఇళ్లు మరింత ఆకర్షణీయంగా మారడంతోపాటు మొక్కల ద్వారా ఆక్సిజన్ కూడా లభిస్తుంది. ఈ మొక్కలు వారి ఇంట్లో కాంతి, స్వచ్ఛతను పెంచుతాయి.
ఒత్తిడిని తగ్గించడానికి కూడా...
ఇంట్లో వాతావరణాన్ని ఆరోగ్యకరంగా ఉంచడానికి, గాలి శుద్ధీకరణలో సహాయపడతాయి. ఒత్తిడిని తగ్గించడానికి కూడా చిన్న మొక్కలు చాలా బాగా పని చేస్తాయి. దీంతో అనేక మంది నగరవాసులు చిన్న మొక్కలు (Plant Business) పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ చిన్న మొక్కల ద్వారా బిజినెస్ (Business Idea) కూడా చేయవచ్చు. దీని ద్వారా నెలకు 40 వేలకుపైగా సంపాదించే అవకాశం ఉంది. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
చిన్న కూండీలతోపాటు
ఈ వ్యాపారం చేసేందుకు మీరు చిన్న మొక్కల విత్తనాలను కుండీలలో నాటి పెంచాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మార్కెట్లో డిమాండ్ ఉన్న హౌస్ ప్లాంట్స్, సుక్యులెంట్స్, మినీ చెట్లు వంటి అనేక అరుదైన మొక్కల విత్తనాలను తీసుకొచ్చి పెంచితే వాటిని అమ్ముకునేందుకు సిద్ధం చేసుకోవచ్చు. దీనికోసం మీరు చిన్న కూండీలతోపాటు మట్టి, విత్తనాలను సేకరించాల్సి ఉంటుంది. దీని కోసం మీరు హోల్ సేల్ విధానంలో కుండీలను తెచ్చుకుంటే తక్కువ ధరకు లభిస్తాయి. లేదా ప్లాస్టిక్ ఖాళీ వాటర్ బాటిల్స్ సేకరించి వాటిని కుండీలుగా తయారు చేసుకున్నా కూడా మీకు ఖర్చు మరింత తగ్గుతుంది.
ఎంత లాభం...
ఈ వ్యాపారాన్ని మీరు ఎక్కడైనా ప్రారంభించవచ్చు. మీకు 20 చిన్న కుండీలు పట్టే స్థలం ఉంటే సరిపోతుంది. కానీ మొక్కలను పెంచే ప్రాంతం సూర్యరశ్మి పడే విధంగా ఉండాలి. పెంట్ హౌస్ లాంటివి ఉండే ప్రాంతం మరింత సౌకర్యంగా ఉంటుంది. ఈ క్రమంలో మీరు పెరిగిన చిన్న మొక్కలను మార్కెట్లో అమ్మడం ద్వారా లాభాలను గడించవచ్చు. ఇలాంటి మొక్కలను మార్కెట్లో సాధారణంగా కనీసం రూ.100 నుంచి రూ. 500 వరకు సేల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదాహరణకు మీరు రోజుకు 200 రూపాయల మొక్కలను 10 అమ్మినా కూడా మీకు నెలకు రూ. 40 వేలకుపైగా లాభం వచ్చే అవకాశం ఉంది.
మార్కెటింగ్ ద్వారా..
మీకు ఆసక్తి ఉంటే మరిన్ని ఎక్కువ మొక్కలను పెంచి మార్కెట్లో సేల్ చేస్తే మరింత లాభం వస్తుంది. పెంచిన మొక్కల మార్కెటింగ్ కోసం మీరు ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో మొక్కలపై వీడియోలను తీయవచ్చు. సోషల్ మీడియాలో ఈ మొక్కల గురించి పోస్టులు కూడా చేయవచ్చు. దీంతోపాటు వర్క్‌షాప్స్ నిర్వహించడం, అలాగే కస్టమర్లకు ప్రత్యేకమైన ఆఫర్లు అందించడం ద్వారా వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..
Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తికి షాక్.. భారీగా తగ్గిన సంపద
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News