Stock Market: వరుస లాభాలకు బ్రేక్.. సెన్సెక్స్ 400 పాయింట్లు డౌన్..
ABN , Publish Date - Jan 17 , 2025 | 10:13 AM
వరుస లాభాలతో దూసుకుపోతున్న దేశీయ సూచీలకు బ్రేక్ పడింది. మూడు రోజుల లాభాల కారణంగా గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు కూడా మార్కెట్ల పతనానికి కారణమవుతున్నాయి.

వరుస లాభాలతో దూసుకుపోతున్న దేశీయ సూచీలకు బ్రేక్ పడింది. మూడు రోజుల లాభాల కారణంగా గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు కూడా మార్కెట్ల పతనానికి కారణమవుతున్నాయి. మూడు రోజుల్లో లాభపడిన హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తుతుండడం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల బాటలో సాగుతున్నాయి (Business News).
గురువారం ముగింపు (77, 042)తో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 500 పాయింట్లకు పైగా నష్టపోయి 76, 511 వద్ద కనిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం 10: 00 గంటల సమయంలో 382 పాయింట్ల నష్టంతో 76, 653 వద్ద కొనసాగుతోంది. మరో వైపు హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాల కారణంగా నిఫ్టీ నష్టాలతో రోజును ప్రారంభించింది. ప్రస్తుతం ఉదయం 10:00 గంటల సమయంలో 86 పాయింట్ల నష్టంతో 23, 225 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్‌లో మార్కొటెక్ డెవలపర్స్, గుజరాత్ గ్యాస్, ఏపీఎల్ అపోలో, మహానగర్ గ్యాస్ షేర్లు లాభాల బాటలో సాగుతున్నాయి. ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, వరుణ్ బేవరేజెస్, కల్యాణ్ జువెల్లర్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 275 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 659 పాయింట్ల నష్టంలో ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.58గా ఉంది.
మరిన్ని బిజిెనెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..