Share News

Unified Pension Scheme: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ స్కీం అమలు..

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:08 PM

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకానికి (UPS) ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఉద్యోగులు అధిక మొత్తంలో ప్రయోజనాన్ని పొందుతారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Unified Pension Scheme: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ స్కీం అమలు..
Unified Pension Scheme 2025

ఏకీకృత పెన్షన్ స్కీం విషయంలో కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకానికి (Unified Pension Scheme) శనివారం పీఎం నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ పథకం (NPS) కింద ఏకీకృత పెన్షన్ పథకం (UPS) ఎంపికను అందించింది. ఈ క్రమంలో రాష్ట్రాలకు కూడా అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు NPS కింద UPS ఎంపికను ఎంచుకోవచ్చు లేదా UPS ఎంపిక లేకుండా NPSతో కొనసాగవచ్చు.


ఉద్యోగులకు..

అంటే కొత్త పెన్షన్ పథకం ఇప్పటికే NPSలో ఉన్న ఉద్యోగుల కోసం వర్తిస్తుంది. ఇది పాత పెన్షన్ పథకం (OPS), జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) రెండింటి ప్రయోజనాలను కలిపి తయారుచేశారు. ఇప్పుడు ఉద్యోగులు దీని నుంచి పెన్షన్ పొందుతున్నారు. యూపీఎస్ అనేది ప్రభుత్వ కొత్త పథకం. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు NPS కింద UPS ఒక ఎంపికగా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 24న ప్రభుత్వం UPSకి నోటిఫై చేసింది. NPS కిందకు వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు UPS వర్తిస్తుందని తెలిపింది.


ఎప్పటి నుంచి NPS అమలు..

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఎన్‌పీఎస్‌ను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో పాత పెన్షన్ పథకం, NPS ప్రయోజనాలను కలిపి తాజాగా UPSని రూపొందించారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు చివరిగా వారు తీసుకున్న జీతంలో 50% పెన్షన్‌గా అందిస్తుంది. ఈ క్రమంలో ఉద్యోగులకు కరువు భత్యం, కుటుంబ పెన్షన్, ఏకమొత్తం చెల్లింపు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. NPS కింద వచ్చే ఉద్యోగులకు UPS ఎంచుకునే అవకాశం ఉంటుంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా UPS కింద ప్రయోజనాలను అందిస్తారు.


UPS ప్రయోజనాలు

యూపీఎస్ పాత పెన్షన్ పథకానికి చాలా వరకు పోలి ఉంటుంది. ఈ పథకం కింద ఉద్యోగి మరణించిన తర్వాత, పెన్షన్‌లో 60% అతని కుటుంబానికి కుటుంబ పెన్షన్‌గా ఇవ్వబడుతుంది. పదవీ విరమణ సమయంలో, గ్రాట్యుటీతో పాటు, ఉద్యోగులకు ఒకేసారి చెల్లింపు కూడా లభిస్తుంది. ఒక ఉద్యోగి కేంద్ర ప్రభుత్వంలో కనీసం 10 సంవత్సరాలు పనిచేస్తే, అతనికి నెలకు కనీసం రూ. 10,000 పెన్షన్ లభిస్తుంది. UPSని ఎంచుకునే ఉద్యోగులు భవిష్యత్తులో పదవీ విరమణ చేసే ఉద్యోగులతో సమానమైన పాలసీ రాయితీలు, విధాన మార్పులు, ఆర్థిక ప్రయోజనాలు లేదా ఏ విధమైన ప్రయోజనాలను పొందలేరని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.


ఎంత మందికి..

UPSని ఎంచుకునే ఉద్యోగుల పదవీ విరమణ నిధి రెండు భాగాలను కలిగి ఉంటుంది. ఒకటి వ్యక్తిగత నిధి, మరొకటి పూల్ నిధి. వ్యక్తిగత నిధికి ఉద్యోగి, ప్రభుత్వం నుంచి సమాన సహకారం ఉంటుంది. పూల్ ఫండ్‌లో ప్రభుత్వం నుంచి అదనపు సహకారం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు UPS, NPS మధ్య ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా UPSని ఎంచుకునే ఛాన్స్ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు యూపీఎస్‌ను ఎంచుకుంటే, లబ్ధిదారుల సంఖ్య దాదాపు 90 లక్షలు కానుంది. యూపీఎస్ ఏప్రిల్ 1, 2025 నుంచి దేశంలో అమలు చేయబడుతుంది.


సగం జీతం పెన్షన్

ఏకీకృత పెన్షన్ పథకం కింద, 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న ఉద్యోగులు పూర్తి పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతారు. పదవీ విరమణ తర్వాత, అతనికి గత 12 నెలల సగటు జీతంలో సగం అంటే 50% ప్రతి నెలా పెన్షన్‌గా ఇవ్వబడుతుంది. అయితే, ఒక ఉద్యోగి 25 సంవత్సరాల కన్నా తక్కువ కాలం పనిచేస్తే, అతనికి తదనుగుణంగా పెన్షన్ ఇవ్వబడుతుంది. ఈ పథకం కింద పెన్షన్ పొందడానికి, కనీసం 10 సంవత్సరాలు పనిచేయడం అవసరం.


ఇవి కూడా చదవండి:

Edible Oil: గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు

PM Modi: విదేశీ పర్యటన తర్వాత.. ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ


OpenAI: ఇండియాలో చాట్ జీపీటీ డేటా సెంటర్.. ఎప్పటి నుంచంటే..


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్


New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 15 , 2025 | 01:03 PM