Share News

Hyderabad: గుండెపోటుతో హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

ABN , Publish Date - Jan 17 , 2025 | 09:51 AM

ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌(SR Nagar Police Station)లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వినయ్‌ భాస్కర్‌ (53) గుండెపోటుతో బుధవారం రాత్రి మృతి చెందాడు. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు(Heart attack) వచ్చింది.

Hyderabad: గుండెపోటుతో హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

హైదరాబాద్: ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌(SR Nagar Police Station)లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వినయ్‌ భాస్కర్‌ (53) గుండెపోటుతో బుధవారం రాత్రి మృతి చెందాడు. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు(Heart attack) వచ్చింది. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 12.30 ప్రాంతంలో తుదిశ్వాస విడిచాడు. మృతదేహాన్ని బోయిన్‌పల్లిలోని నివాసానికి తరలించారు. డీఐ గోపాల్‌, ఎస్‌ఐలు, సిబ్బందితో కలిసి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి(Inspector Srinath Reddy)..

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అంబేడ్కర్‌ వర్సిటీలో ఎంబీఏ కొత్త కోర్సు


city7.jpg

వినయ్‌ భాస్కర్‌ ఇంటికి వెళ్లి మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సంతపాన్ని తెలియజేశారు. సీఐ వెంట ఎస్‌ఐలు శ్రావణ్‌ కుమార్‌, అఖిల, రాజు రాథోడ్‌, నర్సింగ్‌రావు తదితరులు ఉన్నారు. దహన సంస్కరాల కోసం కో- ఆపరేటీవ్‌ సొసైటీ నుంచి రూ. 50 వేలు, పోలీసు డిపార్ట్‌మెంట్‌ నుంచి రూ. 30 వేలు అందజేశారు. అంత్యక్రియల కోసం బంధువులు మృతదేహాన్ని బాపట్లకు తరలించారు.


ఈవార్తను కూడా చదవండి: Road Accident: తల్లీకుమార్తెను బలిగొన్న పొగమంచు

ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా గురించి మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..

ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే

ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 17 , 2025 | 09:51 AM