Share News

Taati Munjalu: తాటి ముంజలు ఆరోగ్యానికి మంచివా.. చెడ్డవా..

ABN , Publish Date - Mar 01 , 2025 | 10:49 AM

వేసవిలో వచ్చే తాటిముంజలు ఎంతో ప్రత్యేకమైనవి. వీటిని పిల్లలు, పెద్దలు వయసుతో సంబందం లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, ఈ తాటి ముంజలు ఆరోగ్యానికి మంచివా? చెడ్డవా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

Taati Munjalu: తాటి ముంజలు ఆరోగ్యానికి మంచివా.. చెడ్డవా..
Taati Munjalu

తాటిముంజలు వీటిని ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. ఇది వేసవి కాలంలో లభించే ఒక పండు. దీనిని వేసవి సూపర్ ఫుడ్ అని అంటారు. ఈ తాటిముంజలు బయటి నుండి కొబ్బరిలా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటాయి. మండే వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటిముంజలు చాలా ప్రత్యేకమైనవి.

పిల్లలు, పెద్దలు వయసుతో సంబందం లేకుండా వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి కల్తీలేనివి అలాగే స్వచ్చమైనవి. మండుటెండల నుండి ఈ తాటిముంజటు మంచి ఉపశమనం కలిగిస్తాయి. వేసవి సెలవలకు పల్లెటూర్లు వెళ్లేవారు ఖచ్చితంగా వీటిని లాగిస్తారు. వీటిని ఎంత తిన్నా ఇంకా తినాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. పట్టణాల్లో కూడా ఇవి దొరుకుతున్నాయి. తాటిముంజలు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

తాటిముంజల ఆరోగ్య ప్రయోజనాలు

తాటి ముంజల్లో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ కె వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మీరు వీటిని తిన్న వెంటనే మీ శరీరం వెంటనే హైడ్రేట్ అవుతుంది. మీ కడుపు చల్లబడుతుంది. తాటి ముంజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి. వీటిలో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. సమ్మర్‌లో డీహైడ్రేషన్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ పండు ఎంతగానో సహాయపడుతుంది.


గుండె ఆరోగ్యానికి..

తాటి ముంజల్లో పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తాయి.

లివర్ సంబంధిత సమస్యలను..

వేసవిలో తాటిముంజలను రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లివర్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. వీటిని తినడం వలన చెడు కొలస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్ వృద్ధి చెందుతుంది.

రొమ్ము క్యాన్సర్ అవకాశాలను..

వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల వికారం, వాంతులను తాటిముంజలు నివారిస్తాయి. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను కూడా బాగా తగ్గిస్తాయి.

కడుపు సమస్యలకు మేలు: వేసవి కాలంలో తాటిముంజలు మీ కడుపును ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇది తక్షణమే మీ కడుపుకు చల్లదనాన్ని అందిస్తుంది. దీన్ని తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థ బలపడుతుంది. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా ప్రజలు చాలా త్వరగా అంటు వ్యాధులకు గురవుతారు. కాబట్టి, మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి మీరు విటమిన్ సి అధికంగా ఉండే ఈ తాటిముంజలను తినవచ్చు.

జీవక్రియను పెంచుతుంది: బలహీనమైన జీవక్రియ కారణంగా, ప్రజలు అధిక బరువు పెరుగుతారు. అలాగే ఊబకాయానికి గురవుతారు. అయితే, ఫైబర్ అధికంగా ఉండే ఈ పండును తీసుకోవడం వల్ల జీవక్రియ వేగంగా పెరుగుతుంది. అలాగే, దీన్ని తినడం వల్ల మీకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు.

మధుమేహంలో ప్రయోజనకరం: మధుమేహ రోగులకు తాటిముంజలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇది చక్కెరను నియంత్రిస్తుంది.

చర్మ ఆరోగ్యానికి..

తాటి ముంజల గుజ్జును ముఖానికి పైపూతలా వేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది చర్మానికి కావల్సినంత తేమను అందిస్తుంది. వేసవిలో చెమటకాయల్ని నివారిస్తుంది. అలాగే ముఖంపై ఏర్పడే మచ్చలను తగ్గిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

మీకు తరచూ కడుపు నొప్పిగా ఉంటుందా.. అసలు కారణం ఇదే..

ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్.. ఇలా జరుగుతుందని బాస్ ఊహించి ఉండడు

Updated Date - Mar 01 , 2025 | 12:21 PM