Share News

Viral: ఉద్యోగుల అధిక సెలవులతో జర్మనీ సంస్థల సతమతం.. ప్రైవేటు డిటెక్టివ్‌లతో నిఘా!

ABN , Publish Date - Jan 12 , 2025 | 08:25 PM

అనారోగ్యం సాకుతో అధికంగా సెలవులు పెడుతున్న ఉద్యోగుల పనిపెట్టేందుకు జర్మనీ సంస్థలు ప్రైవేటు డిటెక్టివ్‌లను ఆశ్రయిస్తున్నాయి. తప్పు చేసి దొరికిపోయిన వారికి తొలగించేందుకు సిద్ధపడుతున్నాయి.

Viral: ఉద్యోగుల అధిక సెలవులతో జర్మనీ సంస్థల సతమతం.. ప్రైవేటు డిటెక్టివ్‌లతో నిఘా!

ఇంటర్నెట్ డెస్క్: జర్మనీలో మరో ప్రమాదకర ట్రెండ్ వెలుగు చూసింది. సెలవులపై వెళుతున్న ఉద్యోగులపై నిఘా పెట్టేందుకు కంపెనీలు ఏకంగా ప్రైవేటు డిటెక్టివ్‌లను రంగంలోకి దింపుతుండటంపై ప్రస్తుతం అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అనారోగ్యంతో సెలవు తీసుకున్న వారిపై సంస్థలు నిఘా పెడుతున్నాయట. ఇలా అసత్యాలతో సెలవులు తీసుకుంటూ సరిగా పనిచేయని వారిని చివరకు తొలగించేందుకే ఈ వ్యూహం పన్నాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి (Germany).

మీడియా కథనాల ప్రకారం, లెంట్స్ గ్రూప్‌ అనే డిటెక్టివ్ ఏజెన్సీ అందించే ఇలాంటి సేవలకు బాగా డిమాండ్ పెరిగినట్టు తెలుస్తోంది. అనారోగ్యం కోసం సెలవులు పెట్టిన ఉద్యోగులపై నిఘా పెట్టాలంటూ అనేక సంస్థల నుంచి తమకు అభ్యర్థనలు వస్తున్నట్టు సంస్థ వ్యవస్థాపకుడు మార్కస్ లెంజ్ పేర్కొన్నారు. గతంలో పోలిస్తే ఇలాంటి సర్వీసులు కోరుతున్న వారి సంఖ్య రెట్టింపైందని, ప్రస్తుతం ఏటా తాము 1200 కేసులను పర్యవేక్షిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.


Viral: గ్రీన్‌లాండ్‌ను కొనేయాలని ఉబలాటపడుతున్న ట్రంప్.. ఎంత ఖర్చవుతుందంటే..

జర్మనీలో ఇటీవల ఉద్యోగులు విధులకు గైర్హాజరవుతున్న వైనం బాగా పెరిగిపోయింది. ఇది ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. అక్కడి కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2023లో జర్మన్ ఉద్యోగులు అనారోగ్యం పేరిట సగటున 15.1 రోజుల పాటు సెలవు పెట్టారు. 2021లో ఇది కేవలం 11.1 రోజులు మాత్రమే ఉండేది. ఇలా గైర్హాజరీలు పెరిగిన కారణంగా జర్మనీ డీజీపీ 2023లో 0.8 శాతం మేర తగ్గిందనేది ఓ అంచనా. ఇదే తీరు కొనసాగితే ఉద్యోగుల గైర్హాజరీ 2050 నాటికి 5 శాతానికి చేరుకుంటుందని, ఆర్థిక వ్యవస్థ 3 శాతం మేర తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.


USA-Canada: కెనడా అమెరికాలో విలీనమైతే జరిగేది ఇదే..
జర్మనీ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ టీకే గణాంకాల ప్రకారం, తమ సంస్థ ఆరోగ్య బీమా ఉన్న వారు గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య సగటున 14.13 రోజులు అనారోగ్యం పేరిట సెలవులు తీసుకున్నారు. ఇక అంతర్జాతీయ సంస్థ ఓఈసీడీ లెక్కల ప్రకారం, జర్మన్ ప్రజలు అనారోగ్యం కారణంగా 2023లో 6.8 శాతం మేర పనిగంటలను కోల్పోయారు. ఇతర ఈయూ దేశాలైన ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్‌లో కంటే జర్మీలో సిక్ లీవులు తీసుకునే వారి ఎక్కువని తేలింది. జర్మనీ నిబంధనల ప్రకారం, కంపెనీలు ఏడాదికి గరిష్ఠంగా ఆరు వారాల పాటు జీతంతో కూడిన అనారోగ్య సెలవులను ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఆర్థికంగా భారమవుతుండటంతో కంపెనీలు ఉద్యోగుల సెలవుల బాగోతాలను వెలికితీసేందుకు ఖర్చుకు వెనకాడకుండా డిటెక్టివ్‌లను ఆశ్రయిస్తున్నాయట.

Donald Trump : ట్రంప్‌ విస్తరణ కాంక్ష!

Read Latest and International News

Updated Date - Jan 12 , 2025 | 08:25 PM