Share News

Breaking News: గుంటూరు మిర్చి రైతులకు శుభవార్త..!

ABN , First Publish Date - Feb 24 , 2025 | 09:58 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: గుంటూరు మిర్చి రైతులకు శుభవార్త..!
Breaking News

Live News & Update

  • 2025-02-24T18:32:52+05:30

    అమరావతి: గుంటూరు మిర్చి రైతులకు శుభవార్త..!

    • ఎక్స్‌ వేదికగా వెల్లడించిన కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.

    • భారత ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం(MIS) ద్వారా క్వింటాకు రూ.11,781 మద్దతు ధర నిర్ణయం.

    • 25% ఉత్పత్తి కొనుగోలు, అవసరమైతే పెంపు అవకాశం.

    • రైతులకు ఇది కేవలం ఊరట కాదు – బలమైన అండ.

  • 2025-02-24T18:27:53+05:30

    సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. పోలీసులు ఏం చేశారంటే..

    • అమరావతి: సీఎం చంద్రబాబుపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి కార్యకర్త అవుతు శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదు.

    • శ్రీధర్ రెడ్డి మీద FIR నమోదు చేసిన విజయవాడ సూర్యరావుపేట పోలీసులు.

    • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త అవుతు శ్రీధర్ రెడ్డి.

    • ఐటీ యాక్ట్ 2008 ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు.

    • సోషల్ మీడియా వేదికగా కించపరిచే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు.

    • సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారి మీద ఐటీ యాక్ట్ క్రింద కేసు నమోదు, రౌడీ షీట్లు పీడీ యాక్ట్ ప్రయోగం.

  • 2025-02-24T16:24:57+05:30

    పీఎం కిసాన్ నిధులు విడుదల...

    pm kisan yojana.jpg

    పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు.

    సోమవారం నాడు బీహార్‌లోని భాగల్‌పూర్‌లో పీఎం ఈ నిధులు విడుదల చేశారు.

    19వ విడతలో భాగంగా రైతుల ఖాతాల్లో రూ. 2000 జమ చేశారు.

  • 2025-02-24T16:22:22+05:30

    టీడీపీ ఆఫీస్‌పై దాడి.. మరో ముగ్గురు అరెస్ట్..

    • కృష్ణా: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ముగ్గురు అరెస్టు.

    • నిందితులు ఏ27 శివకుమార్‌, ఏ28 ఆదిలక్ష్మి, ఏ54 ప్రవీణ్‌ అరెస్టు.

    • టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నిందితులకు రిమాండ్‌ విధించిన జడ్జి.

  • 2025-02-24T15:55:56+05:30

    • జగన్‌కు ఏపీ అసెంబ్లీ ఝలక్..

    • జగన్ మెడపై ఇంకా వేలాడుతున్న 60 రోజుల అనర్హత వేటు.

    • అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఈ రోజు సమావేశాలకు హజరు అయిన జగన్.

    • ఈ రోజు సమావేశం ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం మాత్రమే.

    • సోమవారం జరిగిన సెషన్ వర్కింగ్ డే కాదని తేల్చిన అసెంబ్లీ వర్గాలు.

    • పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం సమావేశాల ప్రారంభానికి ముందు జరిగే గవర్నర్ ప్రసంగం మాత్రమేనని చెబుతున్న అధికారులు.

    • సోమవారం జరిగిన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం కస్టమరీ సెషన్ అని పేర్కొన్న అధికారులు.

    • మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు సాంకేతికంగా ప్రారంభం కానున్నాయి.

    • అసెంబ్లీ సమావేశాలంటే స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాన్నే వర్కింగ్ డే గా పిలుస్తారంటున్న అధికారులు.

    • సోమవారం జరిగిన సెషన్‌కు హజరు అయిన అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేసినా అవి పరిగణలోకి తీసుకోమంటున్న అధికారులు.

    • రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 క్లాజ్ 4లో వరుసగా 60 రోజులు సభ్యుడు సమావేశాలకు హజరు కాకపోతే సీటు వేకెంట్ అనే డిక్లేర్ చేసే అధికారం స్పీకర్ దే.

    • రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించిన వైసీపీ.

    • దీంతో జగన్ మెడపై వేలాడుతున్న 60 రోజుల గైర్హాజర్ అనర్హత కత్తి.

  • 2025-02-24T14:05:01+05:30

    ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్యే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది..

    • అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.

    • ఏపీలో 5 ఖాళీలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది.

    • మార్చి 29తో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది.

    • మార్చి 3వ తేదీన ఈ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

    • మార్చి 10 నామినేషన్లకు తుది గడువు.

    • 11వ తేదీన స్క్రూటీనీ ఉంటుంది.

    • 13వ తేదీ వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం.

    • మార్చి 20వ తేదీన పోలింగ్ ఉంటుంది.

    • మార్చి 20వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఫలితాలను ప్రకటిస్తారు.

    • తెలంగాణలోనూ 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.

  • 2025-02-24T13:09:30+05:30

    వైసీపీపై ఉపముఖ్యమంత్రి పవన్ హాట్ కామెంట్స్..

    • అమరావతి: అసెంబ్లీ ఆవరణలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడారు.

    • ఈ 5 ఏళ్ళు ప్రతిపక్ష హోదా తమకు రాదని వైసీపీ మానసికంగా ఫిక్స్ అయితే మంచిది.

    • గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు హేయం.

    • ప్రతిపక్ష హోదా అడిగి తెచ్చుకునేది కాదు, ప్రజలు ఇస్తే వచ్చేది.

    • జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వైసీపీకి వచ్చేది

    • సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని వైసీపీ గుర్తించాలి.

    • ఆరోగ్యం బాలేకపోయినా గవర్నర్ సభకు వచ్చి ప్రసంగిస్తే, వైసీపీ అడ్డుకోవాలనుకోవటం హేయం.

    • వైసీపీ హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

    • వైసీపీ నేతలు సభకు వస్తే, ఆ పార్టీకి ఉన్న బలం బట్టి ఎంత సమయం కేటాయించాలో కేటాయిస్తారు.

    • ఉదయం గవర్నర్‌ని ఆహ్వాహించేందుకు స్పీకర్ రమ్మని నన్ను కోరినా, ప్రోటోకాల్ బ్రేక్ చేయటం సరికాదని నేనే వెళ్ళలేదు.

    • ఓట్ల శాతం ప్రకారం తనకు ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లటం మంచిది.

  • 2025-02-24T11:26:44+05:30

    ఘోర ప్రమాదం.. తెలంగాణ వాసులు మృతి..

    • సంగారెడ్డి: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వారణాసి వద్ద ఘోర రోడ్డుప్రమాదం

    • కారు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా వాసులు ముగ్గురు మృతి

    • కుంభమేళాకు వెళ్లొస్తుండగా ప్రమాదానికి గురైన కారు

    • ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి టిప్పర్‌ను కొట్టిన వాహనం

    • ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు

    • మృతులు జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి, భార్య విలాసిని, డ్రైవర్ మల్లారెడ్డిగా గుర్తింపు

    • వెంకటరామిరెడ్డి స్వగ్రామం న్యాల్‌కల్ మండలం మామిడ్గి

  • 2025-02-24T11:07:55+05:30

    వారి పాలనలో ఆర్థికంగా పతనం: గవర్నర్..

    • వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థిక పతనం అంచుకు చేరింది: అబ్దుల్ నజీర్

    • రాష్ట్రానికి జరిగిన నష్టంపై 7 శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలిపాం: గవర్నర్

    • వైసీపీ పాలనలో వనరుల మళ్లింపు, భారీగా సహజవనరుల దోపిడీ: అబ్దుల్ నజీర్

    • వైసీపీ పాలనలో రాష్ట్రం 25 ఏళ్ల ఆదాయాన్ని కోల్పోయింది: గవర్నర్‌

    • ఏపీలో సూర్య ఘర్‌ యోజన కింద సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేస్తున్నాం: అబ్దుల్ నజీర్

    • మా ప్రభుత్వ చర్యలతో టూరిజంలో పెట్టుబడులు పెరిగాయి: గవర్నర్‌

    • MSMEలకు అండగా ఉన్నాం.. అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం: అబ్దుల్ నజీర్

    • యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నాం: గవర్నర్‌

  • 2025-02-24T11:07:54+05:30

    2027 నాటికి పోలవరం పూర్తి: గవర్నర్

    • ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్ట్‌ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం: గవర్నర్‌

    • మన బడి- మన భవిష్యత్తు ద్వారా స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం: అబ్దుల్ నజీర్

    • P-4 విధానం ద్వారా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం: గవర్నర్‌

    • మెరిట్‌ ఆధారంగా 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించాం: అబ్దుల్ నజీర్

    • స్థానికసంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధన ఎత్తివేశాం: గవర్నర్‌

    • కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాం: గవర్నర్‌

    • ఐటీఐలు, పాలిటెక్నిక్‌ల్లో 200 స్కిల్‌ హబ్‌లు ఏర్పాటు: : అబ్దుల్ నజీర్

    • 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: గవర్నర్‌

    • పోలవరం- బనకచర్ల పూర్తయితే రాయలసీమలో కరవు ఉండదు: అబ్దుల్ నజీర్

    • ముగిసిన గవర్నర్ ప్రసంగం.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన గవర్నర్ అబ్దుల్ నజీర్

    • గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీని రేపటికి వాయిదా వేసిన స్పీకర్

  • 2025-02-24T10:52:34+05:30

    మ్యూజికల్ నైట్‌లకు ఎన్నికల కోడ్ వర్తించదా: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ

    • ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని అసెంబ్లీలో కోరాం: ఎమ్మెల్సీ బొత్స

    • ప్రతిపక్షమంటే ప్రజల పక్షం: ఎమ్మెల్సీ బొత్స

    • ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గవర్నర్ ప్రసంగంలో డిమాండ్ చేశాం: ఎమ్మెల్సీ బొత్స

    • సభలో ఉండేవి రెండే పక్షాలు.. కూటమిది అధికారపక్షం.. మేము ప్రతిపక్షం: ఎమ్మెల్సీ బొత్స

    • మిర్చి రైతులను ఆదుకోవాలని అసెంబ్లీ కోరాం: ఎమ్మెల్సీ బొత్స

    • గుంటూరు మిర్చియార్డును జగన్ మోహన్ రెడ్డి సందర్శించే వరకూ ఈ ప్రభుత్వంలో చలనం రాలేదు: ఎమ్మెల్సీ బొత్స

    • రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ బొత్స

    • రైతుల కోసం మాట్లాడితే మా నాయకుడిపై కేసులు పెడతారు: ఎమ్మెల్సీ బొత్స

    • రైతుల సమస్యలకు ఎన్నికల కోడ్ అడ్డొస్తుంది: ఎమ్మెల్సీ బొత్స

    • మ్యూజికల్ నైట్‌లకు ఎన్నికల కోడ్ వర్తించదా: ఎమ్మెల్సీ బొత్స

    • రైతుల సమస్యలు ప్రస్తావించాలంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలి: ఎమ్మెల్సీ బొత్స

    • సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేశారు: ఎమ్మెల్సీ బొత్స

    • బాబు గ్యారంటీ అన్నారు.. అది గ్యారంటీ కాదు మోసం: ఎమ్మెల్సీ బొత్స

    • ప్రభుత్వం ప్రతిస్పందన చూసిన తర్వాతే మేము సభకు రావాలో లేదో చెప్తాం: ఎమ్మెల్సీ బొత్స

    • ప్రజా సమస్యలపై అన్ని రకాలుగా పోరాడుతాం: ఎమ్మెల్సీ బొత్స

  • 2025-02-24T10:47:30+05:30

    వైసీపీ నేతల ప్రెస్ మీట్..

    • అమరావతి: శాసనసభ ప్రారంభమైన 11 నిమిషాలపాటు సభలో ఉన్న జగన్, వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

    • గవర్నర్ ప్రసంగం మెుదలైన 11 నిమిషాలపాటు నినాదాలు చేసి అనంతరం సభ నుంచి వెళ్లిపోయిన జగన్

    • జగన్ వెంట అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

    • అసెంబ్లీ ప్రాంగణ బయట వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రెస్ మీట్ నిర్వహణ

  • 2025-02-24T10:37:14+05:30

    2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం: గవర్నర్‌..

    • ఏపీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: గవర్నర్

    • ప్రతినెల ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తున్నాం: అబ్దుల్ నజీర్

    • పెన్షన్లు రూ.4వేలకు పెంచాం: గవర్నర్‌ అబ్దుల్ నజీర్

    • పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, విద్య, వైద్యం మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాం: గవర్నర్‌

    • బీసీ వర్గాల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం: అబ్దుల్ నజీర్

    • స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఇస్తున్నాం: గవర్నర్‌

    • ఏడాదికి 2 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం: గవర్నర్‌

    • పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించాం, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిపోయేలా చేశాం: అబ్దుల్ నజీర్

    • అర్హులైన పేదలందరికీ సొంతిల్లు ఉండాలనేది మా ఆకాంక్ష: గవర్నర్‌

    • ప్రతి కుటుంబానికీ రక్షిత తాగునీరు, విద్యుత్‌ అందిస్తున్నాం: అబ్దుల్ నజీర్

    • ఐటీ నుంచి ఏఐ రివల్యూషన్‌ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది: గవర్నర్‌

    • సంక్షేమం, అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం: అబ్దుల్ నజీర్

    • 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం: గవర్నర్‌

  • 2025-02-24T10:25:37+05:30

    అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం..

    ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు: గవర్నర్

    ప్రజలు కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది: అబ్దుల్ నజీర్

    గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైంది: గవర్నర్

    వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది: అబ్దుల్ నజీర్

    సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నాం: గవర్నర్

    అధికారంలోకి వచ్చిన వెంటనే ట్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు చేశాం: అబ్దుల్ నజీర్

    అన్నక్యాంటీన్లు తెచ్చి పేదల ఆకలి తీరుస్తున్నాం: గవర్నర్‌

    కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం: అబ్దుల్ నజీర్

    మా ప్రభుత్వంలో తలసరి ఆదాయం పెరిగింది: గవర్నర్‌

    అవకాశాలిస్తే ప్రతిఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారని నమ్ముతున్నాం: అబ్దుల్ నజీర్

  • 2025-02-24T10:20:52+05:30

    శాసనసభ నుంచి వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు..

    • ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ శాసనసభలో గందరగోళం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్యేలు

    • కాసేపు నినాదాలు చేసిన అనంతరం సభ నుంచి బయటకు వెళ్లిపోయిన ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు

  • 2025-02-24T10:05:59+05:30

    ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

    • ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్

    • అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

    • అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కూటమి, వైసీపీ ఎమ్మెల్యేలు

    • గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు

    • ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ సభలో గందరగోళం చేస్తున్న వైసీపీ నేతలు

    • వైసీపీ ఎమ్మెల్యేల నినాదాల నడుమ కొనసాగుతున్న గవర్నర్ ప్రసంగం

  • 2025-02-24T09:58:11+05:30

    మరికాసేపట్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..

    • అమరావతి: కాసేపట్లో ప్రారంభంకానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

    • ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్‌ అబ్దుల్ నజీర్

    • గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడనున్న అసెంబ్లీ

    • అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభకు చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

    • అసెంబ్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి