AICC Sessions: ఏఐసీసీ రెండ్రోజుల సమావేశాలు గుజరాత్‌లో.. ఎప్పుడంటే?
ABN , Publish Date - Feb 23 , 2025 | 08:13 PM
కీలకమైన అంశలపై చర్చించడంతో పాటు సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటుంటున్న సమస్యల పరిష్కారానికి, దేశానికి పటిష్టమైన ప్రత్నామ్నాయ విజన్‌ను ఆవిష్కరించేందుకు ఏఐసీసీ సెషన్ ఒక వేదక కానుందని ఏఐసీసీ ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్ తెలిపారు.

న్యూఢిల్లీ: ఏఐసీసీ (AICC) సమావేశాల తేదీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఏప్రిల్ 8,9 తేదీల్లో గుజరాత్‌లోని అహ్మదాబాద్ (Ahmedabad)లో ఈ సమావేశాలను నిర్వహించనట్టు ఏఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. కీలకమైన అంశలపై చర్చించడంతో పాటు సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటుంటున్న సమస్యల పరిష్కారానికి, దేశానికి పటిష్టమైన ప్రత్నామ్నాయ విజన్‌ను ఆవిష్కరించేందుకు ఏఐసీసీ సెషన్ ఒక వేదక కానుందని ఏఐసీసీ ఇన్‌చార్జి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ తెలిపారు.
PM Modi: చవకగా కేన్సర్ మందులు, దేశవ్యాప్తంగా డేకేర్ సెంటర్లు
''బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలతో ఎదురవుతున్న సవాళ్లు, రాజ్యాంగం, రాజ్యాంగ విలువలపై అవిశ్రాంతంగా జరుగుతున్న దాడి, భవిష్యత్ కార్యాచరణను ఏఐసీసీ సదస్సులో కీలకంగా చర్చించనున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న ఏఐసీసీ డెలిగేట్లు ఇందులో పాల్గొంటారు'' అని వేణుగోపాల్ తెలిపారు.
ఏప్రిల్ 8న జరిగే సీడబ్ల్యూసీ ఎక్స్‌టెన్డెడ్ సెషన్‌కు, 9న జరిగే ఏఐసీసీ డెలిగేట్స్ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షత వహిస్తారని, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియాగాంధీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేషనల్ ఆఫీస్ బేరర్లు, పార్టీ సీనియర్ నేతలు, ఏఐసీసీ డెలిగేట్స్ హాజరవుతారని వేణుగోపాల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి...
CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన
Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన
PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.