Share News

AI Technology : ఏఐతో 9.2 కోట్ల ఉద్యోగాలు ఉష్‌!

ABN , Publish Date - Jan 10 , 2025 | 04:45 AM

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ).. ప్రస్తుతం సాంకేతిక రంగాన్ని శాసిస్తోంది. పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే ఏఐ ఆధారిత స్కిల్స్‌ తప్పనిసరి అనే పరిస్థితి నెలకొంది. ఇది మంచిదే అయినప్పటికీ.. రాబోయే రోజుల్లో

 AI Technology : ఏఐతో 9.2 కోట్ల ఉద్యోగాలు ఉష్‌!
AI Technology

  • ఉద్యోగులను తగ్గించుకోనున్న 41 శాతం కంపెనీలు

  • ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగులపై ప్రభావం

  • వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరం తాజా నివేదిక

న్యూఢిల్లీ, జనవరి 9: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ).. ప్రస్తుతం సాంకేతిక రంగాన్ని శాసిస్తోంది. పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే ఏఐ ఆధారిత స్కిల్స్‌ తప్పనిసరి అనే పరిస్థితి నెలకొంది. ఇది మంచిదే అయినప్పటికీ.. రాబోయే రోజుల్లో ఈ కృత్రిమ మేధ(ఏఐ) వల్ల ఉద్యోగాలు భారీగా కోల్పోయే ప్రమాదం ఉందని ‘వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరం ఫ్యూచర్‌ ఆఫ్‌ జాబ్స్‌’ తాజా నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 41ు కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకోవాలని భావిస్తున్నాయని తెలిపింది. ఏఐ వల్ల 2030 నాటికి 17 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా వేసి న ఈ నివేదిక.. 9.2 కోట్ల ఉద్యోగాలు పోతాయని తెలిపింది. ఏఐ టూల్స్‌ అభివృద్ధి, డిజైన్‌ చేసే నైపుణ్యం కలిగిన కొత్త వారిని నియమించుకోవడానికి 70ు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని పేర్కొంది.


భవిష్యత్తులో ఏఐ, బిగ్‌ డేటా, సైబర్‌ సెక్యూరిటీ నైపుణ్యాలకు అధిక డిమాండ్‌ ఉంటుందని వెల్లడించింది. ఏఐ పాత్ర పెరిగినప్పటికీ.. సృజనాత్మక ఆలోచన, క్రియాశీలత వంటి మానవ నైపుణ్యాలు కూడా కీలకమేనని తెలిపింది. జనరేటివ్‌ ఏఐ, టెక్నాలజీలో వేగంగా వస్తున్న మార్పులు.. పరిశ్రమలు, కార్మిక రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయని, ఈ నేపథ్యంలో వ్యాపారులు, ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని, నైపుణ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టి, స్థిరమైన ప్రపంచ శ్రామిక శక్తిని నిర్మించాల్సిన అసవరం ఉందని వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరం ప్రతినిధి టిల్‌ లియోపోల్డ్‌ చెప్పారు.

Updated Date - Jan 10 , 2025 | 10:32 AM