Share News

Atishi: ప్రెస్‌మీట్‌లో కంటతడి పెట్టిన సీఎం

ABN , Publish Date - Jan 06 , 2025 | 04:07 PM

తన తండ్రి తన జీవితమంతా ఒక టీచర్‌గా పనిచేశారని, పేద, మధ్యతరగతికి చెందిన వేలాది మంది పిల్లలకు పాఠాలు చెప్పారని, ఇప్పుడు ఆయన వయస్సు 80 సంవత్సరాలని అతిషి తెలిపారు.

Atishi: ప్రెస్‌మీట్‌లో కంటతడి పెట్టిన సీఎం

న్యూఢిల్లీ: బీజేపీ నేత రమేష్ బిధూరి (Ramesh Bidhuri) తనపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి (Atishi) సోమవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కంటతడి పెట్టారు. రాజకీయాలు ఇంతగా దిగజారిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అతిషి ఇంటిపేరుపై బిధూరి చేసిన వ్యాఖ్యలు వివాదం కావడంతో ఆమె మీడియా ముందుకు వచ్చారు.

Delhi Voter List: ఢిల్లీ ఓటర్ల తుది జాబితాను విడుదల చేసిన ఈసీ


''రాజకీయాలు ఎందుకు ఇంతలా దిగజారిపోయాయి? ఆయన (బిధూరి) పదేళ్లుగా కల్కాజీ నియోజకవర్గానికి చేసిన పనులు ఉంటే వాటి గురించి చెప్పుకోవచ్చు. చేసిన పనుల ఆధారంగా ఓట్లు అడగొచ్చు. కానీ మా తండ్రిగారిని అవమానించడం సరికాదు'' అని అతిషి ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి తన జీవితమంతా ఒక టీచర్‌గా పనిచేశారని, పేద, మధ్యతరగతికి చెందిన వేలాది మంది పిల్లలకు పాఠాలు చెప్పారని, ఇప్పుడు ఆయన వయస్సు 80 సంవత్సరాలని తెలిపారు. ఆయన నిజంగానే అస్వస్థతతో ఉన్నారని, ఎవరో ఒకరి సాయం లేకుండా నడవలేకపోతున్నారని చెప్పారు. ఎలక్షన్ల కోసమని తన తండ్రిపై ఆయన (బిధూరి) బురద చల్లుతారా? ఒక వృద్ధుడిపై నిందలు వేస్తారా? ఈ దేశ రాజకీయాలు ఇంతలా దిగజారిపోతాయని తాను ఎన్నడూ అనుకోలేదని అతిషి తెలిపారు.


బిధూరి ఏమన్నారు?

అతిషి ఇంటిపేరు 'మార్లేనా' అని.. 'సింగ్'గా పేరు మార్చుకున్నారని రోహిణిలో జరిగిన బీజేపీ పరివర్తన ర్యాలీలో బిధూరి అన్నారు. కల్కాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అతిషి కొద్ది కాలం క్రితమే తన ఇంటిపేరును వదులుకున్నారని చెప్పారు. కల్గాజీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రమేష్ బిధూరి పోటీ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Prashant Kishor Arrest: ప్రశాంత్ కిషోర్ అరెస్ట్.. దీక్షా శిబిరం నుంచి..

Maha Kumbh Mela: కుంభమేళాకు 13 వేల రైళ్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 06 , 2025 | 04:14 PM