Arvind Kejriwal: గోల్డ్ చైన్‌లు పంచుతున్నారు, తీసుకోండి కానీ...
ABN , Publish Date - Jan 14 , 2025 | 03:16 PM
ఢిల్లీ ఓటర్లు డబ్బులకు అమ్ముడుపోవద్దని కేజ్రీవాల్ కోరారు. ఆప్ నేతలు ఎవరైనా డబ్బులు పంచినా సరే వారికి ఓటు వేయవద్దని సూచించారు. గెలుపు, ఓటముల కోసం తాము ఎన్నికల బరిలోకి రాలేదని, దేశంలో మార్పులు తెచ్చేందుకే తాము ఇక్కడ ఉ్ననామని చెప్పారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై మంగళవారం మరోసారి విరుచుకుపడ్డారు. న్యూఢిల్లీలోని రెండు కాలనీల్లో ఓట్ల కోసం బీజేపీ బంగారు గొలుసులు (Gold chains) పంచుతోందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటర్లు డబ్బుకు అమ్ముడుపోవద్దని కోరారు.
Amit Shah: గాలిపటం ఎగరేసిన అమిత్‌షా
డబ్బులు, ఇతర వస్తువులు పంచుతూ ఢిల్లీ ఓటర్లను కొనుగోలు చేయాలని బీజేపీ ప్లాన్‌గా ఉందని మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ చెప్పారు. ''బీజేపీ బంగారు గొలుసులు పంచుతున్నట్టు మాకు తెలిసింది. రెండు కాలనీల్లో గోల్డ్ చైన్‌లు పంచారు. ఢిల్లీ ప్రజలు ఓట్లు కొనుగోలు చేస్తామని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. డబ్బులు, చీరలు, దుప్పట్లు, ఇతర సామాగ్రి కొనడానికి వారికి డబ్బులు ఎక్కడ్నించి వచ్చాయని ప్రజలు అడుగుతున్నారు. ఆ పార్టీ నాయకులు సమాధానం ఇవ్వాలి'' అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీకి సంబంధించి ఎలాంటి విజన్ బీజేపీకి లేనందునే ఇలాంటి నిజాయితీ లోపించిన చర్యలకు బీజేపీ పాల్పడుతోందని విమర్శించారు.
డబ్బులకు అమ్ముడు పోవద్దు..
ఢిల్లీ ఓటర్లు డబ్బులకు అమ్ముడుపోవద్దని కేజ్రీవాల్ కోరారు. ఆప్ నేతలు ఎవరైనా డబ్బులు పంచినా సరే వారికి ఓటు వేయవద్దని సూచించారు. గెలుపు, ఓటముల కోసం తాము ఎన్నికల బరిలోకి రాలేదని, దేశంలో మార్పులు తెచ్చేందుకే తాము ఇక్కడ ఉ్ననామని చెప్పారు. ''బీజేపీ నేతలు ఏమి పంచినా తీసుకోండి. కానీ ఓటును అమ్ముకోకండి. డబ్బులు, జాకట్లు, బ్లాంకెట్లు తదితరాలు పంచేవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్లు వేయద్దు" అని కేజ్రీవాల్ అప్పీల్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
Mahakumbhamela : మహా కుంభమేళాలో.. ఐఐటీ బాబా..
Chennai: తీరప్రాంతానికి కొట్టుకువచ్చిన తాబేళ్ల కళేబరాలు
Read Latest National News and Telugu News