Kunal Kamra Controversy: హాబిటాట్ క్లబ్ ఆక్రమణల తొలగింపు.. రంగంలోకి దిగిన బీఎంసీ
ABN , Publish Date - Mar 24 , 2025 | 04:28 PM
హాబిటాట్ స్టూడియోలో తన షో సందర్భంగా కునాల్ కమ్రా శివసేన నేత, ఉప ముఖ్యమంత్రి షిండేను ద్రోహిగా పోల్చారు. 'దిల్ తో పాగల్ హై' అనే హిందీ పాటను రాజకీయాలకు అనుగుణం పారడీ చేస్తూ పాడారు.

ముంబై: స్టాండింగ్ కమెడియన్ కునాల్ కమ్రా (Kunal Kamra) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వేదికగా నిలిచిన "ది యూనికాంటినెంటల్ హోటల్''లోని హాబిటాట్ క్లబ్‌పై బృహాన్ ముంబై కార్పొరేషన్ (BMC) చర్యలకు దిగింది. స్టూడియో వద్ద అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్‌ను ప్రారంభించేందుకు సిబ్బంది భారీ పనిముట్లతో సోమవారం మధ్యాహ్నం అక్కడకు చేరుకున్నారు. రెండు హోటళ్ల మధ్య ఆక్రమణకు గురైన ప్రాంతంలో స్డూడియో ఉందని అధికారులు చెబుతున్నారు.
Uddhav Thackeray: ద్రోహి అనడం తప్పు కాదు... కునాల్‌ను సమర్ధించిన ఉద్థవ్ థాకరే
దీనిపై అసిస్టెంట్ కమిషనర్ వినాయక్ విస్పుటే మాట్లాడుతూ, స్డూడియో యజమాని అక్రమంగా కొన్ని తాత్కాలిక షెడ్‌లను నిర్మించారని, వాటినే ఇప్పుడు తాము తొలగిస్తున్నామని చెప్పారు. దీనికి నోటీసుల అవసరం లేదన్నారు. స్టూడియో ప్లాన్‌లో అవకతవకలు జరిగాయా అనే దానిని కూడా పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హాబిటాట్ స్టూడియోలో తన షో సందర్భంగా కునాల్ కమ్రా శివసేన నేత, ఉప ముఖ్యమంత్రి షిండేను ద్రోహిగా పోల్చారు. 'దిల్ తో పాగల్ హై' అనే హిందీ పాటను రాజకీయాలకు అనుగుణం పారడీ చేస్తూ పాడారు. ఇది దుమారం రేగడంతో శివసేన కార్యకర్తలు కొందరు ఆదివారం రాత్రి స్టూడియోపై దాడికి దిగారు. ఈ దాడికి సంబంధించి శివసేన నేత రాహుల్ కనాల్, మరో 11 మందిని అరెస్టు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలపై కునాల్‌పై ముంబై పోలీసులు సోమవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..