Mahakumbh: 3.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు
ABN , Publish Date - Jan 14 , 2025 | 09:06 PM
పుష్కరాల తొలిరోజైన సోమవారంనాడు 1.75 కోట్ల మంది త్రివేణి సంగమంలో పవిత్రస్నానాలు ఆచరించగా, మంగళవారం మధ్యాహ్నం వరకూ మరో 1.38 కోట్ల మంది పాల్గొన్నారు.
ప్రయాగ్‌రాజ్: పుష్కరానికి (పన్నెండేళ్లు) ఒకసారి వచ్చే 'మహాకుంభ్' (Maha Kumbh) మహోత్సవ్‌కు భక్తులు పోటెత్తుతున్నారు. గంగా మాత స్మరణతో త్రివేణి సంగమ స్థలి మార్మోగుతోంది. దేశ, విదేశాల నుంచి విచ్చేస్తున్న భక్తుల అంతకంతకూ పెరుగుతున్నారు. ఫిబ్రవరి 26వ తేదీ వరకూ మహాకుంభ్ మహోత్సవ్ కొనసాగుతుండటంతో ఎక్కడ చూసినా సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ప్రయోగ్‌రాజ్ ఆవిష్కరిస్తోంది. పుష్కరాల తొలిరోజైన సోమవారంనాడు 1.75 కోట్ల మంది త్రివేణి సంగమంలో పవిత్రస్నానాలు ఆచరించగా, మంగళవారం మధ్యాహ్నం వరకూ మరో 1.38 కోట్ల మంది పాల్గొన్నారు. మకర సంక్రాతి సాయంత్రానికి 3.5 కోట్ల మంది పవిత్రస్నానాలు చేసినట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
Mark Zukererg: జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ ప్యానల్ సమన్లు
''మకర సంక్రాతి పర్వదినం పురస్కరించుకుని, ఐక్యత, సమానత్వ సందేశాన్ని చాటతూ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించిన సాధువులు, కల్పవాసీలు, భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. తొలి అమృత్ స్నాన్ ఫెస్టివల్ వైభవాన్ని చాటుతూ 3.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారు. సనాతన ధర్మాన్ని ఆరాధించే అఖారాలు, భక్తులు, స్థానిక యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, పారిశుద్ధ కార్మికులు, స్వచ్ఛంద, మత సంస్థలు, బోట్‌మ్యాన్, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు అభినందనలు'' అని సీఎం తెలిపారు.
కాగా, అమృత్ స్నాన్ ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటలకు బ్రాహ్మి ముహూర్తంలో ప్రారంభవుతోంది. పొగమంచు, ఎముకల కొరికే చలిని కూడా భక్తులు లెక్కచేయకుండా సంగమ స్నానాలు చేస్తూ తమ నమ్మకాన్ని, భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. నాగా సాధువులు ఒంటినిండా భస్మధారణతో కాలినడకన, మరికొందరు గుర్రాలపై ఘాట్‌లకు ఊరేగింపుగా తరలివస్తు్న్నారు.
ఇవి కూడా చదవండి..
Mahakumbhamela : మహా కుంభమేళాలో.. ఐఐటీ బాబా..
Chennai: తీరప్రాంతానికి కొట్టుకువచ్చిన తాబేళ్ల కళేబరాలు
Read Latest National News and Telugu News