President Draupadi Murmu: ఎంపీలకు రాష్ట్రపతి అల్పాహార విందు
ABN , Publish Date - Mar 22 , 2025 | 06:13 AM
ఈ అల్పాహార విందులో తెలంగాణ నుంచి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, రామసహాయం రఘురామ్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ షెట్కార్, బలరాం నాయక్, రఘువీర్ రెడ్డి, వంశీకృష్ణ, కడియం కావ్య, బీజేపీ ఎంపీలు డీకే అరుణ,

న్యూఢిల్లీ, మార్చి 21(ఆంధ్రజ్యోతి): పలువురు పార్లమెంట్ సభ్యులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం అల్పాహార విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, గోవా, ఢిల్లీ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా నాగర్ హవేలీ, డామన్ డయ్యూలకు చెందిన ఎంపీలతో కలిసి ఆమె అల్పాహారం చేశారు. వారితో కొంతసేపు ముచ్చటించారు. ఈ అల్పాహార విందులో తెలంగాణ నుంచి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, రామసహాయం రఘురామ్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ షెట్కార్, బలరాం నాయక్, రఘువీర్ రెడ్డి, వంశీకృష్ణ, కడియం కావ్య, బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, నగేష్ , బీఆర్‌ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి, దామోదర్ రావులు పాల్గొన్నారు.