Draupadi Murmu: ప్రగతి దిశగా భారత్ పయనం.. రాష్ట్రపతి రిపబ్లిక్ డే ప్రసంగం
ABN , Publish Date - Jan 25 , 2025 | 09:03 PM
ప్రగతి లక్ష్యాల దిశగా భారతదేశం నిజమైన ప్రయాణం సాగిస్తోందని, అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ ఎదుగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

న్యూఢిల్లీ: దేశం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murumu) శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతి లక్ష్యాల దిశగా భారతదేశం నిజమైన ప్రయాణం సాగిస్తోందని, అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ ఎదుగుతోందని అన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా రిపబ్లిక్ డే వేడుక జరుగుతుండటం దేశప్రజలంతా గర్వహించదగిన విషయమని అన్నారు. భరతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాలని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు మార్చుకున్నామని, కొత్తచట్టాలు రూపొందించి అమల్లోకి తెచ్చామని అన్నారు. వలసవాదుల ఆలోచనా విధానం మార్చేందుకు దేశం ప్రయత్నాలు చేస్తోందన్నారు. శనివారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో జమిలి ఎన్నికల అంశాన్ని కూడా ప్రస్తావించారు.
Padma Awards 2025: పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
''1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చింది. అయితే వలసవాదుల ఆలోచనా విధానం చాలాకాలంగా మనను చాలాకాలంగా వెన్నాడుతోంది. ఆలస్యంగానైనా వలసవాదుల ఆలోచన విధానాన్ని మార్చేందుకు దేశం ప్రయత్నాలు చేస్తోంది. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అభినియం తీసుకువచ్చాం. మార్పుల చేసిన చట్టాలతో మహిళలు, చిన్నారులపై నేరాలకు వ్యతిరేకంగా కట్టుదిట్టమైన చర్యలు అత్యధిక ప్రాధాన్యతనిచ్చాం'' అని రాష్ట్రపతి తెలిపారు.
భారత రాజ్యాంగం గత 75 ఏళ్లుగా మన ప్రగతికి మార్గాలు వేసిందని, రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించిన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బీఆర్ అబేండ్కర్, ఇతర సభ్యుల కృషికి కృతజ్ఞతలు తేలియజేసుకుంటున్నామని రాష్ట్రపతి అన్నారు. మన యువభారత సర్వతోముఖాభివృద్ధికి రాజ్యాంగం ఎంతగానో దోహదపడిందని చెప్పారు. కనీస సౌకర్యాల కల్పించడం ద్వారా దేశ సంక్షేమాన్ని ప్రభుత్వం పునర్నిర్వచించిందని అన్నారు.
దేశంలో సుపరిపాలన అందించేందుకు ''వన్ నేషన్ వన్ ఎలక్షన్'' విధానం తోడ్పడుతుందని రాష్ట్రపతి అన్నారు. స్థిరత్వాన్ని ప్రోత్సహించడం, వనరుల మళ్లింపును, ఆర్థిక భారాన్ని తగ్గించడం వంటి అనేక రకాల ప్రయోజనాలు జమిలి ఎన్నికల వల్ల కలుగుతాయని అన్నారు. గత దశాబ్దాంగా విద్యారంగంలో సంస్కరణల ద్వారా నాణ్యతాయుతమైన విద్యను అందించడం, ఫిజకల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్‌క్లూషన్ సుసాధ్యమైందన్నారు.
ఇవి కూడా చదవండి