Saif Ali Khan: సైఫ్ నివాసంలోకి దొంగ ఎలా ప్రవేశించాడంటే..?
ABN , Publish Date - Jan 16 , 2025 | 03:47 PM
Saif Ali Khan: సైఫ్‌పై దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగుడి దాడిలో సైఫ్‌తో పాటు మహిళకు సైతం గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు.

ముంబై, జనవరి 16: బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ ఆలీఖాన్‌పై దుండగుడు దాడి ఘటన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులోభాగంగా సైఫ్ నివాసంలోకి దుండగుడు ఎలా ప్రవేశించాడనే అంశంపై ఆ ప్రాంతంలోని సీసీ ఫూటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. సదరు అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాద సమయంలో అత్యవసర మార్గం ద్వారా కిందకు దిగేందుకు ఏర్పాటు చేసిన మార్గం ద్వారా సైఫ్ నివాసంలోకి దుండగుడు ప్రవేశించాడని పోలీసులు గుర్తించారు. అలాగే దుండగుడిని సైతం పోలీసులు గుర్తించారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందుకోసం 10 బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు.
ఇప్పటికే చోరీతోపాటు హత్యాయత్నానికి సంబంధించి పలు సెక్షన్ల కింద దుండగుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఈ దాడికి రెండు గంటల ముందు సీసీటీవీ ఫుటేజ్‌లో సైఫ్ నివసిస్తున్న హౌసింగ్ సొసైటీలోకి ఎవరు ప్రవేశించిన దృశ్యాలు అయితే కనిపించలేదని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. అలాగే దుండుగుడి దాడిలో సైఫ్‌తోపాటు అతడి బృందంలోని మహిళ గాయపడిందని పోలీసులు తెలిపారు.
ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.. దీంతో ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేశారని పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు. సైఫ్‌పై దాడి ఘటన నేపథ్యంలో అతడి సిబ్బందిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ దాడికి సంబంధించి అదనపు విషయాల రాబట్టేందుకు వారిని ప్రశ్నిస్తున్నట్లు వివరించారు.
Also Read: సైఫ్ అలీఖాన్‌పై దాడి.. ఆందోళనలో కరీనా కపూర్
మరోవైపు సైఫ్ నివసిస్తున్న హౌసింగ్ సొసైటీలో పలు భవనాల పునర్ నిర్మాణ పనులు జరుగుతోన్నాయన్నారు. ఆ యా పనుల్లో కార్మికులు పాల్గొన్నారని వివరించారుర. వారిని సైతం అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అయితే ఈ హౌసింగ్ సొసైటీలోకి ఎవరు ప్రవేశించలేదని సెక్యూరిటి గార్డ్ స్పష్టం చేయడం గమనార్హం. ఇంకోవైపు సైఫ్ అలీ ఖాన్ నివాసంలో దుండగుడి ఆనవాళ్లు సేకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పటికే అక్కడికి చేరుకుని.. పలు ఆధారాలను సేకరించారు.
సైఫ్ అలీఖాన్ నివాసంలోకి గురువారం తెల్లవారుజామున దుండగుడు చోరీకి యత్నించాడు. ఈ విషయాన్ని గమనించి.. అతడిని నిరోధించే ప్రయత్నం చేశాడీ సైఫ్. ఆ క్రమంలో ఇద్దరి మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో సైఫ్‌పై దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని లీలావతి ఆసుపత్రికి తరలించారు. అతడికి వైద్యులు శస్త్ర చికిత్సలు నిర్వహించారు. సైఫ్ ఎలాంటి ప్రాణ నష్టం లేదని వైద్యులు వెల్లడించారు. సైఫ్ పై దాడి నేపథ్యంలో ఈ మీడియాతోపాటు ఆయన అభిమానులు సమయమనం పాటించాలని ఆయన టీమ్ కోరింది.
For National news And Telugu News