Share News

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ట్రైన్ అదుర్స్.. 180 స్పీడ్‌తో వెళ్లినా చుక్కనీరు కూడా..

ABN , Publish Date - Jan 03 , 2025 | 11:23 AM

వందే భారత్ స్లీపర్ రైలు గురించి క్రేజీ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఈ ట్రైన్ స్పీడ్ టెస్ట్ చేస్తున్న క్రమంలో ట్రైన్లో పెట్టిన గ్లాసులో నీరు కిందపడకపోవడం విశేమని చెప్పవచ్చు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ట్రైన్ అదుర్స్.. 180 స్పీడ్‌తో వెళ్లినా చుక్కనీరు కూడా..
Vande Bharat Sleeper Train

దేశంలో వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) రైలు త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలోనే ఇటివల ఈ రైలును పలు ప్రాంతాల్లో పరీక్షించారు. ఆ క్రమంలో ఈ ట్రైన్ ఖచ్చితమైన వేగంతో దూసుకెళ్లింది. అదే సమయంలో ట్రైన్‌లో నీటితో నింపిన ఓ గ్లాసు నుంచి చుక్క నీరు కూడా కింద పడకపోవడం విశేషం. అందుకు సంబంధించిన ఓ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ వీడియో చూసిన పలువురు గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్రైన్ పనితీరును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.


పలు ప్రాంతాల్లో టెస్టింగ్

కొత్తగా సిద్ధం చేసిన వందేభారత్ స్లీపర్ కోచ్ రైలు పరీక్షల నిమిత్తం ఇటివల కోటకు వచ్చింది. అక్కడ దానిపై బరువు ఉంచి, వేర్వేరు వేగంతో ఖాళీగా రన్ చేయడం ద్వారా పరీక్షించారు. అందులో బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ సస్పెన్షన్, కప్లర్ ఫోర్స్‌లను పరీక్షించారు. ఈ రైలును గంటకు 180 కి.మీ వేగంతో నడిపారు. ఈ పరీక్ష డిసెంబర్ 31 నుంచి కోట రైల్వే డివిజన్‌లోని ఢిల్లీ-ముంబై రైల్వే ట్రాక్‌పై ప్రారంభమైంది. ఇందులో వందే భారత్ ట్రయల్ మొదట నాగ్డా మధ్య.. తర్వాత సవాయి మాధోపూర్, కోట మధ్య నిర్వహించబడుతోంది. ఈ పరీక్షల అనంతరం పూర్తి నివేదికను రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డుకు పంపనుంది.


బరువు ఉంచుతూ స్పీడ్..

కోటా నాగ్డా రైల్వే సెక్షన్‌లోని రోహల్ ఖుర్ద్, చౌమహ్లా మధ్య మొదట్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులతో సమానమైన బరువుతో నడిచింది. ఇందులో మొదట్లో 130, తర్వాత 140, తర్వాత 150 స్పీడ్‌తో ట్రయల్‌ను తీసుకున్నారు. దీని తర్వాత రైలును జనవరి 1న 160 వేగంతో, రోహల్ ఖుర్ద్ విక్రమ్‌ఘర్‌లో 177 వేగంతో అదే ట్రాక్‌పై పరీక్షించారు. అలాగే రోహల్ ఖుర్ద్, కోటా మధ్య 40 కిలోమీటర్ల దూరంలో 180 కి.మీ వేగంతో రైలు ట్రయల్ చేశారు. ఇందులో భాగంగా వందేభారత్ స్లీపర్ టెస్టింగ్ మూడో రోజు గురువారం కూడా జరిగింది. దీని కింద కోటా నుంచి లాబన్ మధ్య 30 కిలోమీటర్ల దూరంలో ప్రయాణికుల సమాన బరువును ఉంచుతూ వందే భారత్ 180 కి.మీ వేగంతో నడపబడింది.


మొత్తం కోచ్‌లు ఎన్నో తెలుసా..

రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే మెరుగైన సౌకర్యాలతో వస్తున్న వందే భారత్ స్లీపర్ 180 kmph వేగంతో సెమీ-హై స్పీడ్ రైలు అవుతుంది. BEML తయారు చేసిన మొదటి నమూనా మొత్తం 16 కోచ్‌లను కలిగి ఉంటుంది. ఇందులో 11 AC 3 టైర్ కోచ్‌లు, 4 AC 2 టైర్ కోచ్‌లు, ఒక AC ఫస్ట్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. అలాగే రెండు కోచ్‌లు ఎస్‌ఎల్‌ఆర్‌గా ఉంటాయి. 16 కోచ్‌ల రైలు మొత్తం 823 మంది ప్రయాణికులు ప్రయాణించేలా రూపొందించబడింది. ఇందులో AC 3 టైర్‌లో 611 బెర్త్‌లు, AC 2 టైర్‌లో 188 బెర్త్‌లు, AC 1లో 24 బెర్త్‌లు ఉన్నాయి. దీనిని జనవరి 2025లో ఢిల్లీ-ముంబై లేదా ఢిల్లీ-కోల్‌కతా మార్గంలో మొదలవుతుందని తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

Train Accident: రైల్వే ట్రాక్‌పై కూర్చుని పబ్‌జీ ఆడిన కుర్రాళ్లు.. రైలు ఢీకొని ముగ్గురు..


Tax Relief: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. 87A పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకునే ఛాన్స్


రిలయన్స్‌ జియో రూ.40,000 కోట్ల ఐపీఓ!


Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..


Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 03 , 2025 | 12:03 PM