Share News

Yogi Adityanath: కుంభమేళాను విమర్శించేవారు రాబందులు, పందులు యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్య

ABN , Publish Date - Feb 25 , 2025 | 04:47 AM

అలాంటివారు రాబందులు, పందులు అని ప్రతి విమర్శ చేశారు. కుంభమేళాలో ఎవరు ఏది కోరుకుంటే అదే దొరుకుతుందన్నారు. ‘రాబందులకు శవాలు దొరుకుతాయి.

Yogi Adityanath: కుంభమేళాను విమర్శించేవారు రాబందులు, పందులు యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: మహా కుంభమేళాను విమర్శించేవారిపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటివారు రాబందులు, పందులు అని ప్రతి విమర్శ చేశారు. కుంభమేళాలో ఎవరు ఏది కోరుకుంటే అదే దొరుకుతుందన్నారు. ‘రాబందులకు శవాలు దొరుకుతాయి. పందులకు బురద దొరుకుతుంది. సున్నితమైన వ్యక్తులకు అద్భుతమైన సంబంధాలు దొరుకుతాయి. వ్యాపారులకు బేరాలు, భక్తులకు స్వచ్ఛమైన ఏర్పాట్లు ఉన్నాయి’ అని చెప్పారు. ‘నిర్వహణ లోపాల వల్ల హజ్‌లో తొక్కిసలాట జరిగితే లౌకిక మేధావులు ఎవరూ మాట్లాడలేదు. అలాంటివారే కుంభమేళా ఏర్పాట్లపై విమర్శలు చేస్తున్నారు.


ఎంతగా దుష్ప్రచారం చేస్తున్నా లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేస్తూనే ఉన్నారు’ అని చెప్పారు. కుంభమేళాలో దురదృష్టకర సంఘటనలు చోటుచేసుకున్నప్పటికీ భక్తుల విశ్వాసం, ఉత్సాహంలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌పై విమర్శలు చేస్తూ వారిలాగా మతవిశ్వాసాలతో ఆడుకోబోమన్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కుంభమేళా ఏర్పాట్లను సక్రమంగా చేయలేదని ఆరోపించారు.


ఇవి కూడా చదవండి..

Thackeray Brothers: దగ్గరవుతున్న థాకరేలు.. పెళ్లి వేడుకలో మళ్లీ కలుసుకున్న సోదరులు

Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?

Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్‌ బోర్డుకు తారు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 25 , 2025 | 04:47 AM