Child Video: ఓ వైపు పేదరికం.. మరోవైపు అంధురాలైన తల్లి.. ఈ బాలుడి కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆగవు..
ABN , Publish Date - Feb 25 , 2025 | 08:11 PM
చాలా మంది పిల్లలకు చాలా భద్రంగా బాల్యం గడిచిపోతుంది. కానీ, కొందరికీ ఆ అదృష్టం దక్కదు. పసి వయసు నుంచే కష్టాలు మొదలవుతాయి. మోయలేని భారం మీద పడుతుంది. పేదరికం వారి ఆశలను చిదిమేస్తుంది. అండగా నిలవాల్సిన తల్లిదండ్రులే కష్టాల్లో ఉంటే ఆ చిన్నారే సంరక్షకుడిగా మారాల్సి వస్తుంది.

బాల్యం (Childhood) అనేది చాలా మందికి మధురమైన జ్ఞాపకం. చదువు, ఆటపాటలు, సంరక్షించే తల్లిదండ్రులు.. చాలా మంది పిల్లలకు చాలా భద్రంగా బాల్యం గడిచిపోతుంది. కానీ, కొందరికీ ఆ అదృష్టం దక్కదు. పసి వయసు నుంచే కష్టాలు మొదలవుతాయి. మోయలేని భారం మీద పడుతుంది. పేదరికం (Poverty) వారి ఆశలను చిదిమేస్తుంది. అండగా నిలవాల్సిన తల్లిదండ్రులే కష్టాల్లో ఉంటే ఆ చిన్నారే సంరక్షకుడిగా మారాల్సి వస్తుంది. ప్రస్తుతం అలాంటి ఓ కుర్రాడి (Boy)కి సంబంధించిన హృదయవిదారక వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది (Emotional Video).
flywiser1 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ బాలుడు తలకు మించిన భారాన్ని మోస్తూ కనిపిస్తున్నాడు. ఆ వీడియోలో కుర్రాడు ఆరు బయట పడుక్కున్న తన తల్లికి అన్నం తినిపిస్తున్నాడు. అన్నంలో నీళ్లు, ఉప్పు వేసి తన తల్లికి ముద్దలు చేసి పెడుతున్నాడు. అంత చిన్న వయసులో ఆ కుర్రాడి దీన స్థితి చూస్తే ఎంతటి వారి హృదయమైనా ముక్కలవడం ఖాయం. తల్లి గోరు ముద్దలు తినిపిస్తే తినాల్సిన వయసులో ఎంతో కష్టపడి ఆహారం సేకరించి తల్లికి తినిపిస్తున్నాడు. ఆ కుర్రాడి దీనగాథను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేల మంది ఆ వీడియోను వీక్షించారు. వందల మంది తమ బాధను కామెంట్ల రూపంలో తెలియజేశారు. ``దేవుడా.. హృదయం ముక్కలైపోయింది``, ``ఆ కుర్రాడు ఎంతటి ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు``, ``ఈ వీడియో చూశాక నాకు ఏడుపు వచ్చింది``, ``పేదరికం ఇంత దారుణమైన దెబ్బలే కొడుతుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Dangerous Stunt Video: వీళ్లను చూసి ప్రమాదమే పక్కకు తప్పుకుంటుందేమో.. వీడియో చూస్తే భయపడాల్సిందే..
Optical Illusion: మీ చూపు షార్ప్ అయితే.. ఈ పిల్లుల మధ్యనున్న ఎలుకను 5 సెకెన్లలో కనుగొనండి..
Optical Illusion: మీ కళ్లు చురుకైనవి అయితే.. ఈ ఫొటోలో ``HOT`` పదాన్ని 5 సెకెన్లలో కనుగొనండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి