Share News

Vasectomy Gift for Wife: భార్యకు బహుమతిగా వేసక్టమీ ఆపరేషన్ చేసుకున్న డాక్టర్! వీడియో నెట్టింట వైరల్!

ABN , Publish Date - Jan 23 , 2025 | 07:10 PM

అవాంఛిత గర్భం వస్తుందన్న భయంలో ఉన్న తన భార్యకు ఓ డాక్టర్ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. తనకు తానే వేసక్టమీ ఆపరేషన్ చేసుకున్నారు. తైవాన్‌‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

Vasectomy Gift for Wife: భార్యకు బహుమతిగా వేసక్టమీ ఆపరేషన్ చేసుకున్న డాక్టర్! వీడియో నెట్టింట వైరల్!

ఇంటర్నెట్ డెస్క్: జీవిత భాగస్వామిపై ఉన్న ప్రేమను జనాలు రకరకాలుగా వ్యక్తపరుస్తుంటారు. కొందరు ఖరీదైన బహుమతులు ఇస్తారు. మరికొందరు విదేశీ టూర్లు వేస్తారు. ఇంకొందరు సింపుల్‌గా ఇంటిపనుల్లో సాయపడి తమ ప్రేమను చాటుకుంటారు. కానీ ఓ డాక్టర్ మాత్రం ఇందుకు భిన్నమైన పంథాను అనుసరించారు. తన భార్యకు బహుమతిగా అతడు వేసక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాడు. తైవాన్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం తాలూకు వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది. జనాలు షాకైపోయేలా చేస్తోంది (Vasectomy Gift for Wife).

Kumbhmela Monalisa Harassed: కుంభమేళా మోనాలిసాకు వేధింపులు! ఆగంతుకులు ఆమె టెంట్‌లోకొచ్చి..


తైపీ నగరానికి చెందిన సర్జన్ డా. చెన్ వీ నాంగ్ తన భార్యకు ఈ అసాధారణ బహుమతిని ఇచ్చారు. తనకు తానుగా వేసక్టమీ ఆపరేషన్ చేయించుకున్న అతడు సర్జరీ మొత్తాన్ని వీడియోలో రికార్డు చేసి భార్యకు బహుమతిగా ఇచ్చాడు. అవాంఛిత గర్భం భయాలను దూరం చేసేందుకు అతడు భార్యకు ఈ విధమైన గిఫ్ట్‌ను సిద్ధం చేశాడు. అంతేకాకుండా, యువ డాక్టర్లకు శస్త్రచికిత్స విధానాన్ని తెలియపరిచే ఉద్దేశంతో ఓ ఎడ్యుకేషనల్ వీడియోగా దీన్ని షేర్ చేశాడు. శస్త్రచికిత్స తాలూకు రిస్క్ తగ్గించుకునేందుకు తనకు తానే ఆపరేషన్ చేసుకున్నట్టు తెలిపాడు. ‘‘ఈ ఆపరేషన్ సందర్భంగా కొద్దిగా నొప్పి అనిపించింది. నాకు నేను కుట్లు వేసుకోవడం కొద్దిగా వింతగా తోచింది’’ అని అన్నాడు. అయితే, ఈ అపరేషన్ దిగ్విజయంగా ముగిసింది. ఆపరేషన్ తరువాతి రోజు తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని కూడా చెప్పుకొచ్చాడు. ఈ ఆపరేషన్ ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ముందుగా వివరించి ఆ తరువాత విజయవంతంగా ఆపరేషన్ చేసుకున్నాడు


Air Hostess to pig farmer: ఎయిర్ హోస్టస్ జాబ్‌కు గుడ్ బై చెప్పి పందుల పెంపకం! 2 నెలలు తిరిగే సరికల్లా..

కాగా, ఈ వీడియోకు నెట్టింట భారీ స్పందన వచ్చింది. ఏకంగా 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అనేక మంది అతడిని ప్రశంసించారు. తన నైపుణ్యాలపై అతడికి అపారమైన నమ్మకం ఉందని కూడా అన్నారు. కొందరు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తనకు తానే శస్త్రచికిత్స చేసుకోగలిగాడం అసాధారణ సాహసమని అన్నారు. మరో డాక్టర్ సాయం తీసుకుంటే పోయేదేముందని కొందరు ప్రవ్నించారు. అతడికి తన భార్యపై ప్రేమాభిమానాలు ఎక్కువని అభిప్రాయపడ్డారు. ఎనస్తీషియా తీసుకున్నప్పటికీ ఆ నొప్పిని భరించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.

Read Latest and Viral News

Updated Date - Jan 23 , 2025 | 07:10 PM