Shocking Video: ఓర్నీ.. ఇలాంటి పనులు కూడా చేస్తారా? వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే..
ABN , Publish Date - Feb 25 , 2025 | 09:39 PM
కర్ణాటకకు చెందిన నలుగురు కుర్రాళ్లు తాజాగా చేసిన ఓ పని అందరికీ తెలిసిపోయింది. స్కూటీ మీద వచ్చి వారు చేసిన పని సీసీటీవీలో రికార్డు అయింది. దాంతో వారు చేసిన ఘనకార్యం క్షణాల్లో వైరల్ అయిపోయి అందరినీ చేరిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ ఘటన అయినా అందరికీ క్షణాల్లో చేరిపోతోంది. తప్పు చేస్తూ కెమెరా కంటికి దొరికితే చాలు.. ఒకటి, రెండు రోజులు ఆలస్యమైనా అందరినీ చేరడం మాత్రం ఖాయం. కర్ణాటక (Karnataka)కు చెందిన నలుగురు కుర్రాళ్లు తాజాగా చేసిన ఓ పని అందరికీ తెలిసిపోయింది. స్కూటీ మీద వచ్చి వారు చేసిన పని సీసీటీవీలో రికార్డు అయింది. దాంతో వారు చేసిన ఘనకార్యం క్షణాల్లో వైరల్ అయిపోయి అందరినీ చేరిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది (Viral Video).
ghantaa అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెల్లవారుజామున నలుగురు యువకులు స్కూటీ మీద రోడ్డు మీద ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఓ దుకాణం బయట అనేక పాల ప్యాకెట్లు (Milk Bags) ఉన్నాయి. వారు అక్కడ ఆగి తమకు దొరికినన్ని పాల ప్యాకెట్లు పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. దుకాణం యజమాని వారిని గమనించి కేకలు వేసుకుంటూ బయటకు వచ్చాడు. అప్పటికే వారు స్కూటీ మీద వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది (steal milk bags).
ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దాదాపు 5 లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. దాదాపు పాతిక వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వారు చదువుకున్న మూర్ఖులు``, ``పాల ప్యాకెట్లను కూడా దొంగిలిస్తారా``, ``ఇది నిజంగా సిగ్గు చేటు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Child Video: ఓ వైపు పేదరికం.. మరోవైపు అంధురాలైన తల్లి.. ఈ బాలుడి కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆగవు..
Dangerous Stunt Video: వీళ్లను చూసి ప్రమాదమే పక్కకు తప్పుకుంటుందేమో.. వీడియో చూస్తే భయపడాల్సిందే..
Optical Illusion: మీ చూపు షార్ప్ అయితే.. ఈ పిల్లుల మధ్యనున్న ఎలుకను 5 సెకెన్లలో కనుగొనండి..
Optical Illusion: మీ కళ్లు చురుకైనవి అయితే.. ఈ ఫొటోలో ``HOT`` పదాన్ని 5 సెకెన్లలో కనుగొనండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.