Share News

Hyderabad: స్పెయిన్‌ దేశస్థులను ఆకర్షిస్తున్న మసీదు..

ABN , Publish Date - Feb 01 , 2025 | 10:25 AM

నగర సందర్శనకు వచ్చే స్పెయిన్‌(Spain) పర్యాటకులు బేగంపేటకు రాకుండా వెళ్లడం లేదు. ఇక్కడ ఉన్న ఓ మసీదే అందుకు కారణం. స్పెయిన్‌ దేశంలోని మ్రముఖ మసీదును పోలి ఉన్న మసీదు ఇక్కడ వారికి దర్శనమిస్తుంది.

Hyderabad: స్పెయిన్‌ దేశస్థులను ఆకర్షిస్తున్న మసీదు..

- ఆ దేశ శైలిలో నిర్మించడమే కారణం

- భారత్‌లో ఈ తరహా మసీదు ఇదొక్కటే

హైదరాబాద్: నగర సందర్శనకు వచ్చే స్పెయిన్‌(Spain) పర్యాటకులు బేగంపేటకు రాకుండా వెళ్లడం లేదు. ఇక్కడ ఉన్న ఓ మసీదే అందుకు కారణం. స్పెయిన్‌ దేశంలోని మ్రముఖ మసీదును పోలి ఉన్న మసీదు ఇక్కడ వారికి దర్శనమిస్తుంది. బేగంపేట(Begumpet)లోని స్పానిష్‌ మసీదును సందర్శించిన వారు తమ దేశంలో ఉన్నట్లు ఆనందపడిపోతారు. భారతదేశంలో ఎక్కడా కనిపించని స్పెయిన్‌ మోడల్‌ మసీదు హైదరాబాద్‌లోని బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో ఉంది. స్పానిష్‌ వాస్తు శైలిలో, యురోపియన్‌ మొగలాయి అందాలను కలబోసి పాయిగా నవాబు ఇక్కడ ఈ మసీదును అద్భుత నైపుణ్యంతో నిర్మించారు.

ఈ వార్తను కూడా చదవండి: WhatsApp DP: వాట్సాప్‌ డీపీలో ఫొటో మార్చి.. మహిళను ఏమార్చి..


సుమారు 120 సంవత్సరాలు గడిచినా ఈ మసీదు చెక్కు చెదరలేదు. 1897 సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఉన్న పాయిగా వంశీయుల్లో ఐదవ అమీర్‌, హైదరాబాద్‌ ప్రధానమంత్రి సర్‌ వికార్‌ ఉల్‌ ఉమ్రా స్పెయిన్‌ పర్యటనకు వెళ్లారు. అక్కడ అద్భుత వాస్తు నైపుణ్యంతో ఉన్న స్పానిష్‌ మసీదును చూసి ఇలాంటిదే తమ ప్రాంతంలో నిర్మించాలని సంకల్పించారు. తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం ఆ తరహాలోనే ఈ మసీదు నిర్మాణం చేపట్టారు. పాయిగా కుటుంబానికి బేగంపేటలో 1600 ఎకరాల భూములు ఉన్నాయి.


city8.2.jpg

ఫలక్‌నుమా ప్యాలెస్‌ తర్వాత బేగంపేట ప్యాలెస్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1897లో ఈ మసీదు నిర్మాణ పనులు ప్రారంభించగా, 1902లో ఆయన మృతిచెందారు. ఆయన కుమారుడు సుల్తాన్‌ ఉల్‌ ముల్క్‌ మసీదు(Sultan ul Mulk Mosque) నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ మసీదు నిర్మాణానికి సుమారు 3 సంవత్సరాల సమయం పట్టింది. తరహా నిర్మాణాన్ని పోలిన మసీదు దేశంలో మరెక్కడా లేకపోవడంతో దీనిని చూసేందుకు సందర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మసీదులో 8 ముఖాలు గల రెండు గుమ్మటాలు ఒక దానిపై ఒకటి ఉంటాయి. పాయిగా పాలకులు తమ కుటుంబ సభ్యులు ప్రార్థనలు చేసుకునేందుకు అప్పట్లో ఈ మసీదును నిర్మించుకున్నారని తెలుస్తోంది. ఈ మసీదు సందర్శనకు స్పెయిన్‌ దేశస్థులు తరచూ వస్తుంటారని మసీదు ముత్తవల్లి, కస్టోడియన్‌ ఫయాజ్‌ఖాన్‌ తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Financial Survey: పన్ను వసూళ్లలో తెలంగాణ నం.1

ఈవార్తను కూడా చదవండి: ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మహిళల అదృశ్యం!

ఈవార్తను కూడా చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: ఏకంగా సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్‌చల్

Read Latest Telangana News and National News

Updated Date - Feb 01 , 2025 | 10:25 AM