Share News

Viral: గంటకు 282 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైలుకు వేళాడుతూ ప్రయాణం! తృటిలో తప్పిన ప్రమాదం!

ABN , Publish Date - Jan 19 , 2025 | 10:29 PM

జర్మనీలో ఓ ప్రయాణికుడు హైస్పీడు రైలు పట్టుకుని వేలాడుతూ ఏకంగా 30 కిలోమీటర్ల మేర ప్రయాణించారు. అతడు ఎక్కేలోపే అది బయలుదేరడంతో కంగారు అతడు బోగీ పట్టుకుని వేలాడుతూ వెళ్లాడు. అదృష్టవశాత్తూ అధికారులు సమయానికి రైలును ఆపడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

Viral: గంటకు 282 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైలుకు వేళాడుతూ ప్రయాణం! తృటిలో తప్పిన ప్రమాదం!

ఇంటర్నెట్ డెస్క్: జర్మనీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రయాణికుడు ఏకంగా హైస్పీడు రైలు బోగీకి వెళాడుతూ 30 కిలోమీటర్ల మేర ప్రయాణించారు. అప్పటికే పోలీసులు అలర్ట్ కావడంతో రైలును మార్గమధ్యంలో ఆపి నిందితుడిని కాపాడారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, 40 ఏళ్ల వ్యక్తి ఒకరు మ్యూనిచ్ స్టేషన్‌లో టిక్కెట్టు లేకుండానే రైలు ఎక్కాడు. అదేమో హైస్పీడ్ ఇంటర్ సిటీ రైలు. గంటకు గరిష్ఠంగా 282 కిలోమీటర్ల వేగానికి మించి ప్రయాణించగలదు (Viral).


Viral: ఇంటి ఓనర్‌కు భారీ షాకిచ్చిన పని మనిషి! ఏం జరిగిందో తెలిస్తే..

అయితే, రైలు ఇంగోల్స్టాడ్ స్టేషన్‌లో ఆగాక అతడు సిగరెట్ కాల్చేందుకు కిందకు దిగాడు. అతడు మళ్లీ రైలు ఎక్కే లోపే అది బయలుదేరడం ప్రారంభించింది. అప్పటికే ఆటోమేటిక్ తలుపులు మూసుకుపోవడంతో అతడి రైలెక్కే అవకాశమే లేకుండా పోయింది. అతడి లగేజీ కూడా రైల్లోనే ఉండిపోయింది. దీంతో, కంగారు పడిపోయిన అతడు గాబరాగా బోగీని పట్టుకుని వెళాడాడు. ఆ తరువాత రెండు బోగీల మధ్యలో ఉన్న ప్లాంక్‌పై నిలబడి అక్కడున్న తీగలను పట్టుకుని వేళాడుతూ ప్రమాదకరంగా ప్రయాణించారు.


Viral: వలసపాలనపై పశ్చాత్తాపం.. భారతీయులకు క్షమాపణలు చెప్పిన బ్రిటన్ పాప్ సింగర్

అప్పటికే వేగం పుంజుకున్న రైలు ఏకంగా 250 కిలోమీటర్ల స్పీడుతో ఏకంగా 30 కిలోమీటర్లు ప్రయాణించింది. అయితే, స్టేషన్‌లో అప్పటికే అతడి నిర్వాకం గమనించిన కొందరు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు రైలు లోకోపైలట్‌కు సమాచారం అందించి మార్గమధ్యంలోనే రైలును ఆపుచేయించారు. ఆ తరువాత నిందితుడిని జాగ్రత్తగా కిందకు దించి రైల్లో కూర్చోపెట్టారు. ఆ తదుపరి స్టేషన్‌లో పోలీసుల అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే, ఈ ప్రమాదకరమైన స్టంట్‌కు పూనుకున్నా కూడా ప్రయాణికుడికి ఎలాంటి ప్రమాదం కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన పనులకు దిగొద్దంటూ పోలీసులు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.

Viral: వామ్మో.. ఈ కోతి గాలిపటం ఎగరేయడం ఎక్కడ నేర్చుకుందో.. షాకింగ్ వీడియో

Viral: బిడ్డను కన్నందుకు పరిహారంగా భార్యకు ‘మహిళా పన్ను’ చెల్లింపు! ఇదేం తీరు దేవుడా..

Read Latest and Viral News

Updated Date - Jan 19 , 2025 | 10:29 PM