Tiger Video: బ్రదర్ అది కుక్క అనుకున్నావా? పులికి కర్ర చూపిస్తే ఏం చేసిందో చూడండి..
ABN , Publish Date - Feb 24 , 2025 | 07:50 PM
క్రూర మృగాలు ఎప్పుడు, ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తాయో ఊహించడం కష్టం. అయితే ఇటీవలి కాలంలో చాలా మంది సింహాలను, పులులను పెంచుకుంటున్నారు. వాటితో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వాటితో ఎంత సన్నిహితంగా ఉన్నా, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే.

సింహం, పులి వంటి వన్య ప్రాణులకు ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. ఆ క్రూర మృగాలు (Wild Animals) ఎప్పుడు, ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తాయో ఊహించడం కష్టం. అయితే ఇటీవలి కాలంలో చాలా మంది సింహాలను, పులుల (Tigers)ను పెంచుకుంటున్నారు. వాటితో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వాటితో ఎంత సన్నిహితంగా ఉన్నా, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. లేకపోతే ప్రమదానికి గురి కాక తప్పుదు (Tiger Video). ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది (Viral Video).
nouman.hassan1 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను పాకిస్తాన్‌లో చిత్రీకరించారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నౌమాన్ హసన్ అని చెప్పబడింది, అతను పాకిస్తాన్ నివాసి. అతను తన ఇంట్లో పులి, సింహం వంటి అనేక ప్రమాదకరమైన జంతువులను పెంచుకుంటున్నాడు. ముందుగా ఆ వ్యక్తి పులికి కట్టిన చైన్ పట్టుకుని నడుస్తున్నాడు. మరుసటి క్షణంలోనే, పులి పరిగెత్తడం ప్రారంభించి, ఆ వ్యక్తిని తనతో పాటు లాగేసింది. అప్పుడు ఆ వ్యక్తి ఆత్మరక్షణ కోసం కర్రతో దానిని కొట్టడానికి ప్రయత్నిస్తాడు.
ఆ వ్యక్తి చర్యతో తీవ్ర ఆగ్రహానికి గురైన పులి ఆ వ్యక్తిపై దాడి చేస్తుంది. అతడి పైకి ఎగిరింది. అతడిని కింద పడేసింది. మరో వ్యక్తి సకాలంలో పరిగెత్తుకుంటూ వచ్చి అతడిని రక్షించాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 75 లక్షల మందికి పైగా వీక్షించారు. లక్ష మందికి పైగా ఆ వీడియోను వీక్షించి కామెంట్లు చేశారు. అతడికి పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: మీ కళ్లు చురుకైనవి అయితే.. ఈ ఫొటోలో ``HOT`` పదాన్ని 5 సెకెన్లలో కనుగొనండి..
Rooster: కోడి నా జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తోంది.. కేరళ వాసి ఫిర్యాదుపై అధికారులు ఏం చేశారంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి