Bride and Groom: వీళ్లు పెళ్లి చేసుకుంటున్నారా? ఫైటింగ్ చేస్తున్నారా? వీడియో చూస్తే నవ్వుకోవడం ఖాయం..
ABN , Publish Date - Feb 21 , 2025 | 09:11 PM
సోషల్ మీడియా వీడియోల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉండి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన ఫన్నీ, ఎమోషనల్ దృశ్యాలు సోషల్ మీడియా జనాలను ఆకర్షిస్తున్నాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉండి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన ఫన్నీ, ఎమోషనల్ దృశ్యాలు సోషల్ మీడియా జనాలను ఆకర్షిస్తున్నాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని వధూవరులు (Bride and Groom) ఉంగరం (Ring) కోసం చేసిన ఫైట్ చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది (Viral Video).
@AsurOfficial అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ పెళ్లి (Wedding) కార్యక్రమం జరుగుతోంది. వధూవరులు పాత్రలోని ఉంగరాన్ని పట్టుకునే తంతు జరుగుతోంది. ఓ పెద్ద పాత్రలో పాలు పోసి దానిలో ఉంగరాన్ని వేశారు. ఆ ఉంగరం పట్టుకోవడం కోసం వధూవరులు పోటీ పడ్డారు. పోటీ పడడం అనడం కంటే పెద్ద యుద్ధమే చేశారు అనడం సరైనది. ఒకరిని ఒకరు తోసుకుంటూ ఉంగరాన్ని పట్టుకోవడం కోసం పోటీ పడ్డారు. వారి ఫైటింగ్‌ను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను తక్కువ సమయంలోనే వేల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``పాపం.. ఆ వరుడి పరిస్థితి పెళ్లి తర్వాత ఎలా ఉంటుందో``, ``ఇద్దరూ సమ ఉజ్జీలు``, ``ఇరు కుటుంబాలు భయపడి ఉంటాయి``, ``వారిద్దరినీ చూస్తే భయం వేస్తోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Hotel: హోటల్‌కు వెళితే రహస్య కెమెరాల బెడద.. ఓ మహిళ ఆ సమస్యకు ఎలా చెక్ పెట్టిందంటే..
Viral Video: అబ్బాయిని వదిలేస్తారు.. అమ్మాయిని మాత్రం కాపాడతారా? ఈ వీడియో చూస్తే..
Shocking: ఇదేందయ్యా ఇదీ.. ఎక్కడా చూడలేదే.. మేనేజర్ పెద్ద పాత్రలో కూర్చున్నాడేంటి? ఎందుకంటే..
Husband and wife: ఇలాంటి భార్య ఎక్కడైనా ఉంటుందా? భర్తకు ఇలాంటి గిఫ్ట్ ఎవరైనా ఇస్తారా?
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..