Share News

Viral: విమానాల్లో కొబ్బరిని అనుమతించరు.. ఎందుకంటే..

ABN , Publish Date - Jan 17 , 2025 | 04:31 PM

విమానాల్లో కొబ్బరి చిప్పలు, ఎండుకొబ్బరికి అనుమతి ఉండదు. వీటితో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో ఎయిర్‌లైన్స్ సంస్థలు వీటిని సాధారణంగా అనుమతించవని నిపుణులు చెబుతున్నారు.

Viral: విమానాల్లో కొబ్బరిని అనుమతించరు.. ఎందుకంటే..

ఇంటర్నెట్ డెస్క్: విమానాల్లో కొబ్బరిబొండాలు, చిప్పలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్న విషయం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణమైన కొబ్బరిని నిషేధించడానికి కారణమేంటా అనే సందేహం కూడా కలగొచ్చు. అయితే, దీని వెనక పలు భద్రతాపరమైన కారణాలు ఉన్నాయని విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు. మరి ఈ కారణాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Viral).

కొబ్బరి.. ముఖ్యంగా ఎండుకొబ్బరిని విమానాల్లో చెక్ ఇన్ లగేజీ లేదా క్యాబిన్ లగేజీలో తరలిస్తే అనేక ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు చెప్పేమాట. ఎండుకొబ్బరిలోని నూనెలు, పీచు పదార్థంతో త్వరగా అగ్గిరాజుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా విమానం కేబిన్‌లోని వాయు పీడనం, ఉష్ణోగ్రతల్లో ఎగుడుదిగుడులు కారణంగా ఎండుకొబ్బరిలోని నూనెలు మండి అగ్నిప్రమాదం సంభవించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. త్వరగా అగ్గిరాజుకునే గుణం ఉన్న వస్తువులను ఎయిర్‌లైన్స్ సంస్థలు అస్సలు అనుమతించవు. ఈ క్రమంలోనే ఎండుకొబ్బరికి అనుమతి ఉండదని నిపుణులు చెబుతున్నారు.


Viral: నా సీటు పైలట్‌కు ఇస్తారా? ఎయిర్ ఇండియాపై ప్రయాణికుడి గుస్సా..

ఇక చిప్పలనే కాకుండా పూర్తి కొబ్బరికాయను కూడా అధికారులు లోపలకు అనుమతించకపోవచ్చు. ఎక్స్ మెషీన్ ద్వారా చెకింగ్ చేసేటప్పుడు కొబ్బరి లోపల ఏముందనేది పూర్తిగా కనిపించదు. దీంతో, ఎక్స్ రే మెషీన్ల సైరెన్లు మోగి అంతా గందరగోళంగా మారే అవకాశం ఉంటుంది. ప్రయాణికుల తనిఖీల్లో జాప్యం పెరిగి అసౌకర్యం తలెత్తే అవకాశం ఉంది. దీంతో, విమానాలు వీటిని కూడా అనుమతించవని నిపుణులు చెబుతున్నారు.

ఇక వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కూడా ఎయిర్‌లైన్స్ సంస్థలు నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తాయి. క్రిములు, ఇతర మొక్కల వ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు పాటిస్తాయి. ఇక కొబ్బరిలో ఓ మోస్తరు స్థాయిలో ఫంగస్ ఉండే అవకాశం ఉంది. వీటిలో దాగుండే క్రిమలు కూడా విదేశాల్లో నానా బీభత్సం చేసే అవకాశం ఉంది.


Viral: పసిబిడ్డతో విమాన ప్రయాణం! టేకాఫ్‌లో జాప్యం జరగడంతో..

ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ సమాచారం ప్రకారం, కొబ్బరిని క్లాస్ 4 కార్గో ప్రమాదకారిగా వర్గీకరిస్తారు. అంటే.. ఎండుకొబ్బరి సడెన్‌గా మంటలు అంటుకోవడం లేదా కొబ్బరి నుంచి వెలువడే కొన్ని వాయులకు నీరు తగిలినప్పుడు వెంటనే అగ్గి రాజుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక కొబ్బరి కుళ్లినట్టైతే అందులోంచి వెలువడే కొవ్వులతో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇలా అనేక రకాల ప్రమాదాలు ఉండటంతో విమానాల్లో కొబ్బరిని అనుమతించరని విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు.

అయితే, స్పైస్ జెట్ లాంటి కొన్ని సంస్థలు చిన్న చిన్న పచ్చి కొబ్బరి ముక్కలను మాత్రం క్యాబిన్ లగేజీ కింద అనుమతిస్తాయి. చెకిన్ లగేజీ విషయంలో మాత్రం కఠినంగా ఉంటాయి.

Read Latest and Viral News

Updated Date - Jan 17 , 2025 | 04:32 PM