Share News

Viral: ఆటో డ్రైవర్‌ను పబ్లిక్‌గా చెంపలు వాయించిన యువతి.. షాకింగ్ వీడియో

ABN , Publish Date - Jan 14 , 2025 | 08:04 PM

చార్జీ విషయంలో తలెత్తిన వివాదంలో ఓ యువతి ఆటో డ్రైవర్‌పై చేయి చేసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

Viral: ఆటో డ్రైవర్‌ను పబ్లిక్‌గా చెంపలు  వాయించిన యువతి.. షాకింగ్ వీడియో

ఇంటర్నెట్ డెస్క్: ఆటోవాలాలతో అప్పుడప్పుడూ కస్టమర్లు గొడవపడటం చూస్తూనే ఉంటాం. కాసేపు వాదులాడుకుని ఆ తరువాత ఎవరి దాని వారు వెళ్లిపోతుంటారు. మరీ అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఒకరిపై ఒకరు చేయి చేసుకునే పరిస్థితి వస్తుంది. అయితే, తాజా వీడియోలో ఓ యువతి ఆటో డ్రైవర్‌ను దారుణంగా కొట్టింది. ఇది చూసి షాకైపోతున్న జనాలు వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు (Viral).

యూపీలోని మిర్జాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, తన ఆటోలో జర్నీ చేసినందుకు డ్రైవర్ యువతిని డబ్బులు అడగడంతో ఈ వివాదం మొదలైంది. పరిమితికి మించి డబ్బులు అడిగాడా లేదా అనే దానిలో స్పష్టత లేకపోయినప్పటికీ యువతి మాత్రం ఓ రేంజ్లో ఆటో డ్రైవర్‌పై రెచ్చింది. కాలర్ పట్టుకుని ఆటోలోంచి బయటకు లాగే ప్రయత్నం చేసింది. అది కుదరకపోవడంతో చెంపలు చడామడా వాయించింది. వద్దు వద్దు అని అతడు అంటున్నా ఆమె పట్టించుకోలేదు, కోపంతో ఊగిపోతూ అతిడిపై విజృంభించింది. ఆటోవాలా చేతులో జోడించి వేడుకుంటున్నా.. వద్దని ఎంత మొత్తుకున్నా ఆమె మాత్రం వినలేదు.


Viral: ఎల్ అండ్ టీ చైర్మన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హెర్ ఆర్ అధిపతి

అయితే, ఈ ఘటనపై తొలుత ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు నిరాకరించారని కొందరు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అయితే, నెట్టింట వీడియో విపరీతంగా ట్రెండవుతుండటంతో వారు ఎట్టకేలకు నెట్టింట స్పందించారు. బాధితుడు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుంటామని నెట్టింట పేర్కొన్నారు.

కాగా, వీడియో చూసిన జనాలు యువతి చేసిన పనికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకరిపై చేయి చేసుకోవడం ఏమాత్రం సభ్యత కాదంటున్నారు. కేవలం డబ్బులు అడిగినందుకే యువతి ఇంత రభస చేసిందా అని మరికొందరు సందేహం వ్యక్తం చేశారు.


Viral: భారత్‌లో పరిస్థితులు ఇంకా మారలేదని ఇప్పుడే అర్థమైంది.. ఎన్నారై విచారం

గతేడాది బెంగళరులో జరిగిన మరో ఘటనలో ఓ ఆటోవాలా.. రైడ్ క్యాన్సిల్ చేసిన యువతిపై చేయి చేసుకున్నాడు. పైసలు ఎవరిస్తారనుకుంటున్నావు అంటూ అనకూడని మాటలు అన్నాడు. ఆమె ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని యువతి అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటూ దురుసుగా మాట్లాడాడు. అయితే, యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Viral: చేతులారా పెళ్లి చెడగొట్టుకున్న వరుడు.. ఏం జరిగిందో తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Jan 14 , 2025 | 08:06 PM