India vs England: రాజ్‌కోట్‌లో టీమిండియాకు ఇంగ్లాండ్ బిగ్ షాక్
ABN , Publish Date - Jan 28 , 2025 | 10:34 PM
ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లలో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్న టీమిండియాకు రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్ బ్రేకులు వేసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 172 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తడబడింది.

ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లలో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్న టీమిండియాకు రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్ బ్రేకులు వేసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 172 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేసింది. బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో టీమిండియా 145 పరుగులు మాత్రమే చేసి 26 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. హార్దిక్ (40), అభిషేక్ శర్మ (24) ఫర్వాలేదనిపించారు (India vs England).
బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (40) బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. అయినప్పటికీ మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లేకపోవడంతో హార్దిక్ పోరాటం వృథా అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఓవర్టన్ 3 వికెట్లు తీశారు. కార్స్, ఆర్చర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ బెన్ డకెట్ (51) అర్ధ శతకంతో రాణించగా, మరో బ్యాటర్ లివింగ్‌స్టన్ (43) విలువైన పరుగులు చేశాడు. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. టీమిండియా ముందు ఇంగ్లండ్ 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బ్యాటర్లు విఫలం కావడంతో టీమిండియా ఓటమి మూటగట్టుకుంది.
ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌నకు విశ్రాంతిని ఇచ్చిన టీమ్ మేనేజ్‌మెంట్ మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు కల్పించింది. కాగా, తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జూలు విదిల్చింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌పై ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ సిరీస్‌లో తర్వాతి రెండు మ్యాచ్‌లు జనవరి 31న పుణెలో, ఫిబ్రవరి రెండో తేదీన ముంబైలో జరగబోతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..