బుమ్రాను నిరోధించేలా చట్టం
ABN , Publish Date - Jan 02 , 2025 | 06:07 AM
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీ్‌స..నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆసీస్, భారత జట్లకు ఇక్కడి తన అధికారిక నివాసంలో బుధవారం విందు ఇచ్చారు. సిరీస్ నాలుగు టెస్ట్‌ల్లో ఇప్పటికే 30 వికెట్లతో...
ఆసీస్ ప్రధాని అల్బనీస్ సరదా వ్యాఖ్య
సిడ్నీ : ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీ్‌స..నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆసీస్, భారత జట్లకు ఇక్కడి తన అధికారిక నివాసంలో బుధవారం విందు ఇచ్చారు. సిరీస్ నాలుగు టెస్ట్‌ల్లో ఇప్పటికే 30 వికెట్లతో ‘కంగారె’త్తిస్తున్న బుమ్రా ప్రదర్శనను ఆయన తెగ మెచ్చుకున్నారు. ‘అతడు ఎడమ చేతితో బౌలింగ్ చేయాలని లేదా ఒక అడుగు వెనక్కు వేయాలని చట్టం చేస్తాం’ అని ఆస్ట్రేలియా క్రికెటర్లతో అల్బనీస్ సరదాగా అన్నారు. భారత కోచ్ గంభీర్ మాట్లాడుతూ..‘ఆస్ట్రేలియా అందమైన దేశం. అయితే ఆ దేశంతో ఆడడం కష్టం. చివరి టెస్ట్‌లో మెరుగైన ప్రదర్శన చేసి రంజింపజేస్తాం’ అని అన్నాడు.