Share News

నితీ్‌ష...ఓ జీనియస్‌

ABN , Publish Date - Jan 02 , 2025 | 06:09 AM

తెలుగు కుర్రాడు నితీష్‌ కుమార్‌ను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. ‘నితీష్‌ ఓ జీనియస్‌. 21 ఏళ్ల వయసులోనే ఈ సిరీ్‌సలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలవడాన్ని నమ్మలేకపోతున్నా...

నితీ్‌ష...ఓ జీనియస్‌

  • ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌

మెల్‌బోర్న్‌: తెలుగు కుర్రాడు నితీష్‌ కుమార్‌ను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. ‘నితీష్‌ ఓ జీనియస్‌. 21 ఏళ్ల వయసులోనే ఈ సిరీ్‌సలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలవడాన్ని నమ్మలేకపోతున్నా. సిరీస్‌ మొత్తం ఏమ్రాతం అంచనాలు లేకున్నా అదరగొట్టి, అందరినీ ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో అతడికి ఎవరన్నా భయం లేదు. టెయిలెండర్లతో కలిసి అద్భుతంగా ఆడాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో తానేంటో నిరూపించుకున్నాడు. నితీష్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపించాలి. ఆరో స్థానం అతడికి సరిపోతుంది’ అని క్లార్క్‌ అభిప్రాయపడ్డాడు.

Updated Date - Jan 02 , 2025 | 06:09 AM