ఆటగాళ్ల భద్రత విధులకు నిరాకరణ పాక్ పోలీసులపై వేటు
ABN , Publish Date - Feb 27 , 2025 | 03:35 AM
చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ మెగా టోర్నీ భద్రత కోసం నియమించిన పోలీసుల్లో దాదాపు వంద మందిపై ప్రభుత్వం...

లాహోర్: చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ మెగా టోర్నీ భద్రత కోసం నియమించిన పోలీసుల్లో దాదాపు వంద మందిపై ప్రభుత్వం వేటు వేసింది. పంజాబ్ ఫ్రావిన్స్‌కు చెందిన ఈ పోలీసులు తమకు కేటాయించిన విధులను నిర్వర్తించేందుకు నిరాకరించడమే వేటుకు ప్రధాన కారణం. ‘చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియం నుంచి జట్లు బస చేసే హోటళ్ల వరకు క్రికెటర్ల భద్రత కోసమని పోలీసులను కేటాయించాం. అయితే, వీరిలో కొందరు బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించగా, మరికొందరు పూర్తిగా విధులకు హాజరుకాలేదు. భద్రత పరంగా ముఖ్యంగా విదేశీయులకు సంబంధించిన విషయంలో ఇలాంటివి జరిగితే సహించేదే లేదు. అందుకే వారికి వెంటనే విధుల నుంచి ఉద్వాసన పలికాం’ అని పంజాబ్ ఐజీపీ ఉస్మాన్ అన్వర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Pak media on TeamIndia victory: భారత్ విజయంపై పాక్ మీడియా వక్రభాష్యం.. విజయానికి కారణం అదేనట..
Team India Champions Trophy 2025: టీమిండియాకు ఇంత మేలు చేస్తారా? ఐసీసీపై పలువురు క్రికెటర్ల ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోెసం క్లిక్ చేయండి..