Share News

Viral News: టీమిండియా విక్టరీ.. క్షమాపణ చెప్పిన ఐఐటీ బాబా

ABN , Publish Date - Feb 24 , 2025 | 02:47 PM

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందని అనేక మంది అంచనాలు వేశారు. ఇదే సమయంలో మహా కుంభమేళాలో ఫేమస్ అయిన ఐఐటీ బాబా టీమిండియా ఈ మ్యాచులో గెలవదని జోస్యం చెప్పారు. కానీ ఆయన చెప్పింది తప్పు కావడంతో, ప్రస్తుతం మరో కీలక ప్రకటన చేశారు.

Viral News: టీమిండియా విక్టరీ.. క్షమాపణ చెప్పిన ఐఐటీ బాబా
IIT Baba Apologizes

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ కోసం క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచుశారు. అయితే ఈ మ్యాచులో పాకిస్తాన్ జట్టు విజయం సాధిస్తుందని ఐఐటీ బాబా (IIT Baba) జోస్యం చెప్పారు. కానీ ఆయన చెప్పింది మాత్రం జరగలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ (Team India) పాకిస్తాన్‌ను ఓడించి, అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలోనే క్రికెట్ లవర్స్ సోషల్ మీడియాలో ఐఐటీ బాబాను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.


స్వరం మార్చిన ఐఐటీ బాబా

విరాట్ కోహ్లీ బాబా కెరీర్‌ను ముగించాడని ఓ వ్యక్తి పేర్కొనగా, మరొకరు మాత్రం బాబా ఇప్పుడు అండర్‌గ్రౌండ్‌కి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇంకో వ్యక్తి మాత్రం ఐఐటీ బాబా, జై షా ఫోటోను షేర్ చేస్తూ.. నిరుత్సాహపడకండి, మీ అంచనాలు ఈసారి పనిచేయలేదని కామెంట్ చేశారు. ఈ సోషల్ మీడియా ట్రోల్స్ నేపథ్యంలో IIT బాబా సోషల్ మీడియాలో క్షమాపణలు చెబుతున్నట్లు ఓ పోస్ట్ చేశారు. భారతదేశం గెలుస్తుందని నా మనసుకు తెలుసని ఆయన పేర్కొన్నారు. ఇది చూసిన నెటిజన్లు మరి ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు. ఫేమస్ అయ్యేందుకు ఇలా చేశారా అని అడుగుతున్నారు.


భారతదేశం గెలవదు..

ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రాండ్ మ్యాచ్ నిన్న భారతదేశం, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగింది. దీనికి ముందే మహా కుంభమేళాలో ప్రసిద్ధి చెందిన ఐఐటీ బాబా, ఎంత ప్రయత్నించినా టీమిండియా గెలవదని పేర్కొన్నారు. ఆ తర్వాత బాబా ప్రకటనపై క్రీడాభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన రెండో మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్ జట్టను ఆరు వికెట్ల తేడాతో ఓడించి, టోర్నమెంట్‌లో తమ రెండో విజయాన్ని నమోదు చేసింది.


ముందే బ్యాటింగ్..

నిన్న మ్యాచులో టాస్ గెలిచిన తర్వాత, ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు పాకిస్తాన్ ఆటగాళ్లు. ఆ క్రమంలో భారత బౌలర్ల అద్భుతమైన ప్రదర్శన ముందు పాకిస్తాన్ ఆటగాళ్ల వ్యూహాలు పనిచేయలేదు. పాకిస్తాన్ నెమ్మదిగా ఆట ప్రారంభించినప్పటికీ, తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు పడిపోయాయి. ఈ మ్యాచులో పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 46 పరుగులు, సౌద్ షకీల్ 62 పరుగులు చేశారు. కానీ మిగిలిన బ్యాట్స్ మెన్స్ పెద్దగా స్కోరు చేయలేకపోయారు. దీంతో పాకిస్తాన్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత వచ్చిన టీమిండియా 4 వికెట్ల నష్టానికి 42.3 ఓవర్లలో 242 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా పూర్తి చేసి విజయం సాధించింది.


ఇవి కూడా చదవండి:


Upcoming IPOs: పెట్టుబడిదారులకు అలర్ట్.. వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Aadhaar Update: అలర్ట్.. ఆధార్‌లో మీ నంబర్, పేరు, అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా..


Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 24 , 2025 | 02:49 PM