Share News

Virat Kohli: కోహ్లీ వాచ్ కలెక్షన్ చూస్తే షాక్.. ఓ వాచ్ ధరతో ఇల్లు కొనేయొచ్చు

ABN , Publish Date - Jan 17 , 2025 | 05:09 PM

టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ మంచి లగ్జరీ గడియారాల ప్రియుడని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ధరించిన గడియారాల ధరలు చూసిన పలువురు మాత్రం షాక్ అవుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Virat Kohli: కోహ్లీ వాచ్ కలెక్షన్ చూస్తే షాక్.. ఓ వాచ్ ధరతో ఇల్లు కొనేయొచ్చు
ViratKohliWatches

టీమిండియా ఆటగాళ్లలో ఒకరైన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరుపై అనేక రికార్డులు ఉన్నాయి. ఆయన జట్టులోనే కాదు, బయట కూడా స్టైలిష్‌గా కనిపిస్తారు. దీంతోపాటు ఆయనకు లగ్జరీ గడియారాలపై మంచి అభిరుచి ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే విరాట్ వాచ్ కలెక్షన్(Watch Collection) గురించి ఓ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ వాచ్ కలెక్షన్ చూసిన అనేక మంది షాక్ అవుతున్నారు. వాటిలో రూ. 5 లక్షల నుంచి రూ. 45 లక్షల వరకు ఉన్న గడియారాలు కూడా ఉన్నాయి.


విరాట్ కోహ్లీ వాచ్‌లు:

1. రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా

ఇటీవల అలీబాగ్‌లో విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీతో విహారయాత్ర చేసిన క్రమంలో ఈ వాచ్ హైలెట్‌గా కనిపించింది. ఆ సమయంలో విరాట్ రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ధరించారు. దీని విలువ ప్రస్తుతం రూ. 45,36,000. ఈ వాచ్ డిజైన్‌తో పాటు అత్యాధునిక ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. విరాట్ కోహ్లీ తన ఆటలో అత్యుత్తమమైన ప్రదర్శన కోసం కూడా ఈ వాచ్ పలుమార్లు ధరించారు. ఈ వాచ్ రేటు దాదాపు ఒక సాధారణ ఇళ్లు కొనుగోలు చేసే అంత ధర ఉండటం విశేషం.


2. రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా 116500LN

విరాట్ కోహ్లీ చూస్తే సాధారణంగా ఉంటాడని అనేక మంది అనుకుంటారు. కానీ ఆయన ధరించే గడియారాల ఎంపికలో కూడా చాలా విలాసవంతమైన శ్రేణి ఉంది. ఆయన ధరించిన మరోక వాచ్ రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా 116500LN. దీని ధ రూ. 12,00,000. ఐస్టర్ స్టీల్‌తో తయారైన 40mm డయల్‌తో ఇది పనిచేస్తుంది. ఫ్యాషన్ ప్రపంచంలో ఇది ఒక గుర్తింపు పొందిన గడియారంగా పేరుగాంచింది.


3. రోలెక్స్ స్కై డ్వెల్లర్

విరాట్ కోహ్లీ వాచ్ కలెక్షన్‌లో ఇంకో ప్రధాన గడియారం రోలెక్స్ స్కై-డ్వెల్లర్. దీని రేటు కూడా రూ. 12,00,000. ఇది 42mm డయల్, ఆయిస్టర్ స్టీల్ మెటీరియల్‌తో తయారైంది. ఈ గడియారం క్లాస్, ఖచ్చితత్వానికి ప్రతీకగా ఉంటుంది. రోలెక్స్ లైనప్‌లో అత్యంత ఆధునిక మోడళ్లలో ఇది కూడా ఒకటిగా ఉంది.

4. రోలెక్స్ ఆయిస్టర్ పెర్పెచువల్ 41mm

విరాట్ కోహ్లీ ఎప్పుడూ కొత్త మోడళ్లను తీసుకుంటారు. అలాంటి వాటిలో రోలెక్స్ ఆయిస్టర్ పెర్పెచువల్ 41mm గ్రీన్ డ్యూయల్ డయల్ వాచ్ కూడా చేరింది. దీని విలువ రూ. 5,00,000. ఆకుపచ్చ మెరుపు, ఆయిస్టర్ బ్రాస్లెట్‌తో ఇది కల్గి ఉంటుంది. ఇది ఒక క్లాసీ గడియారం. విరాట్ స్టైల్, కొత్తదనానికి ఈ వాచ్ గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది.


విరాట్ కోహ్లీ స్టైల్

విరాట్ కోహ్లీ గడియారాల సేకరణ నెమ్మదిగా ఆయన స్టైల్, అభిరుచిని మరింత పెంచుతుందని చెప్పవచ్చు. ఆటలో ఎన్నో విజయాలను సాధించిన విరాట్ క్రికెట్ స్టార్‌గా మాత్రమే కాదు, లగ్జరీ గడియారాల సేకరణలో కూడా రికార్డ్ సృష్టిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

EV Launch: 500 కి.మీ రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ప్రముఖ సంస్థ లాంచ్

Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు

SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి


Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 17 , 2025 | 05:13 PM