Betting Apps: బెట్టింగ్ యాప్స్ కేసులో.. శ్యామలకు ప్రశ్నలు
ABN , Publish Date - Mar 25 , 2025 | 04:31 AM
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పంజాగుట్ట పోలీసులు యాంకర్ శ్యామలను 4 గంటలు విచారించారు. ఇప్పటికే ఆమె హైకోర్టు ద్వారా అరెస్టు నుంచి రక్షణ పొందగా.. పోలీసులు నోటీసులు జారీ చేయడం తో సోమవారం ఉదయం తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు.

4 గంటల పాటు విచారించిన పోలీసులు
విదేశాలకు ఇమ్రాన్‌ఖాన్, హర్ష సాయి!
యాప్ నిర్వాహకులకూ త్వరలో నోటీసులు
మెట్రో రైల్‌లో బెట్టింగ్ యాడ్స్‌పై సర్కారును నిలదీస్తున్న నెటిజన్లు
షారుఖ్, సచిన్, కోహ్లీపైనా కేసు పెట్టాలని హైదరాబాద్ గ్రీన్స్ అధ్యక్షుడి ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట/మియాపూర్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పంజాగుట్ట పోలీసులు యాంకర్ శ్యామలను 4 గంటలు విచారించారు. ఇప్పటికే ఆమె హైకోర్టు ద్వారా అరెస్టు నుంచి రక్షణ పొందగా.. పోలీసులు నోటీసులు జారీ చేయడం తో సోమవారం ఉదయం తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు. డీఐ శ్రావణ్‌కుమార్ నేతృత్వంలో ఓ మహిళా ఎస్సై ఆమెను ప్రశ్నించారు. విచారణ తర్వాత శ్యామల మీడియాతో మాట్లాడుతూ పోలీసుల ప్రశ్నలకు జవాబులిచ్చానని, ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతానని చెప్పారు. బెట్టింగ్ యాప్స్ కేసులో అసలు నేరస్థులను పట్టుకోవడంలో పోలీసులకు సహకరిస్తానన్నారు. కాగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో 11 మందిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. యూట్యూబర్లు ఇమ్రాన్‌ఖాన్, హర్షసాయి విదేశాలకు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు శ్యామల సహా.. టేస్టీ తేజ, కిరణ్, విష్ణుప్రియ, రీతూచౌదరిని పోలీసులు విచారించి, వారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. విష్ణుప్రియ, రీతూచౌదరిని మంగళవారం మరోమారు విచారిస్తారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మియాపూర్‌లో కేసులో..
19 బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి 25 మందిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరి లో జగిల్‌రమ్మీ, యోలో 247, ఎయిర్‌ప్లే, జీత్‌విన్, ధనీబుక్ 365, మామ-247, తెలుగు-365, ఎస్-365, జే-365, జడ్‌ఎక్స్‌ఫ్యారీ, మ్యాచ్‌తాజ్-777బుక్, ఆంధ్ర- 365 యాప్‌ల నిర్వాహకులున్నారు. వీరికి నోటీసులి చ్చి, విచారించడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు.
మెట్రోకు మినహాయింపా..?
కాగా, హైదరాబాద్ మెట్రోరైల్‌లో వారం క్రితం ఇలాంటి యాడ్స్ రావడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. మూడే ళ్ల క్రితం ఆన్‌లైన్ రమ్మీ, మైజాక్‌పాట్ రీడ్స్, ప్లే క్రికెట్, పోకర్, తీన్‌పత్తీ, రూట్లీ బెట్టింగ్ యాప్స్‌పై మెట్రోలో యాడ్స్ వచ్చాయి. అప్పట్లోనే వీటి పై విమర్శలు రాగా.. ‘‘మరోమారు ఇలాంటి యాడ్స్ రాకుండా జాగ్రత్త పడతాం’’ అని మెట్రో అధికారులు వివరణిచ్చారు. నాలుగేళ్ల క్రితం బె ట్టింగ్ యాప్స్‌పై ప్రకటన చేసిన సెలబ్రిటీలపై కేసు పెట్టిన పోలీసులు మెట్రోకు ఎలా మినహాయింపులిస్తారని నెటిజన్లు నిలదీస్తున్నారు.
షారుఖ్, సచిన్ కోహ్లీపైనా..
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్, క్రికెటర్లు సచిన్, కోహ్లీపై సోమవారం పంజాగుట్ట పోలీసులకు హైదరాబాద్ గ్రీన్స్ అధ్యక్షుడు అర్జున్‌గౌడ్ ఫిర్యాదు చేశారు. వీరిపైనా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు
Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
For Telangana News And Telugu News