Bird Flu: ఆత్మకూరులో బర్డ్‌ఫ్లూ కలకలం
ABN , Publish Date - Feb 21 , 2025 | 05:40 AM
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని పిన్నంచర్ల గ్రామంలో బర్డ్ ఫ్లూ వైర్‌సతో 3 రోజుల్లోనే 450 కోళ్లకు పైగా మృత్యువాత పడ్డాయి. సమాచారం అందుకున్న పాలమూరు జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం వైద్యాధికారులు కోళ్ల షెడ్డును పరిశీలించారు.

3 రోజుల్లో 450కి పైగా కోళ్ల మృత్యువాత
చికెన్ విక్రయాలు నిలిపివేయాలన్న కలెక్టర్
బర్డ్‌ఫ్లూతో అప్రమత్తంగా ఉండాలి
పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ సూచన
ఆత్మకూరు/మదనాపురం, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని పిన్నంచర్ల గ్రామంలో బర్డ్ ఫ్లూ వైర్‌సతో 3 రోజుల్లోనే 450 కోళ్లకు పైగా మృత్యువాత పడ్డాయి. సమాచారం అందుకున్న పాలమూరు జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం వైద్యాధికారులు కోళ్ల షెడ్డును పరిశీలించారు. కోళ్ల నుంచి నమూనాలను సేకరించారు. ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక వచ్చిన తర్వాతే వ్యాధి నిర్ధారించే అవకాశం ఉందన్నారు. కోళ్ల మరణాల కారణంగా తనకు ఇప్పటివరకు రూ. 10 లక్షల నష్టం వాటిల్లిందని షెడ్డు యజమాని దామోదర్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరు గ్రామంలోని ఫౌలీ్ట్ర ఫాంలో కోళ్లు చనిపోవడంతో సమీప ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. అదనపు కలెక్టర్ సించిత్ గంగ్వార్‌తో కలిసి ఆయన ఫౌలీ్ట్ర ఫామ్‌ను పరిశీలించారు. ఎవరైనా అమ్మకాలు జరిపితే వెంటనే బైండోవర్ చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.