Huma Qureshi: హీరోలు మాత్రం ఆ పాత్రలకు ఒప్పుకోరు..
ABN , Publish Date - Jan 25 , 2025 | 09:04 AM
సినిమాల్లో సాధారణంగా కథానాయికలకు రెండు పాటలు, నాలుగు సన్నివేశాలు ఉంటాయి. అయినా సరే, వారేమీ అభ్యంతరం చెప్పడానికి లేదు అని బాలీవుడ్ నటి హుమా ఖురేషీ(Huma Qureshi) వ్యాఖ్యానించారు.

- బాలీవుడ్ నటి, రచయిత్రి హుమా ఖురేషీ
హైదరాబాద్ సిటీ: సినిమాల్లో సాధారణంగా కథానాయికలకు రెండు పాటలు, నాలుగు సన్నివేశాలు ఉంటాయి. అయినా సరే, వారేమీ అభ్యంతరం చెప్పడానికి లేదు అని బాలీవుడ్ నటి హుమా ఖురేషీ(Huma Qureshi) వ్యాఖ్యానించారు. అదే స్త్రీ ప్రాధాన్యత చిత్రాల్లో మాత్రం హీరోలు తక్కువ సన్నివేశాలున్న పాత్ర చేయడానికి మాత్రం ఒప్పుకోరన్నారు. హైదరాబాద్ సాహితీ మహోత్సవంలో హుమా ఖురేషీ రచించిన ‘జబా - ఆన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో’ పుస్తకం మీద చర్చాగోష్ఠి జరిగింది.
ఈ వార్తను కూడా చదవండి: JNTU: జేఎన్‌టీయూలో అక్రమాలపై విచారణ షురూ..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీ ప్రాధాన్యత పాత్రలు మరిన్ని రావాలని మనం మాత్రమే కోరుకుంటే కాదు, దర్శక, నిర్మాతలు కూడా బలంగా కోరుకోవాలని అన్నారు. అదే సమయంలో రచయితలు కూడా అలాంటి పాత్రలను సృష్టించాలని ఆకాంక్షించారు. అదే రోజు బాలీవుడ్ నటుడు అమోల్ పాలేకర్, సంధ్యా గోఖలే దంపతులతో ‘వ్యూ ఫైండర్’ అంశంపై సినీ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ(Film director Indraganti Mohan Krishna) సమన్వయంలో చర్చాగోష్ఠి జరిగింది.
ఈవార్తను కూడా చదవండి: మా కుమార్తెలా ఏ అమ్మాయీ మోసపోవొద్దు
ఈవార్తను కూడా చదవండి: మేడిగడ్డలో లోపాలను 2019లోనే గుర్తించాం
ఈవార్తను కూడా చదవండి: ఎవుసంపై కేసీఆర్ నజర్
ఈవార్తను కూడా చదవండి: Uttam: హరీశ్‌వి దగుల్బాజీ మాటలు
Read Latest Telangana News and National News