CM Revanth Reddy: దేశ రాజకీయాల్లో తగ్గిన తెలుగు వారి ప్రాభవం
ABN , Publish Date - Jan 05 , 2025 | 08:23 PM
CM Revanth Reddy: దేశ రాజకీయాల్లో పీవీ నరసింహరావు, ఎన్టీఆర్, వెంకయ్యనాయుడు చక్రం తిప్పారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ నేడు జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర సన్నగిల్లిందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్, జనవరి 05: ప్రపంచ తెలుగు సమాఖ్య సభలు హైదరాబాద్ వేదికగా జరగడం హర్షణీయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విదేశాలకు వెళ్లిన తెలుగు వారంతా ఇలా ఒక వేదిక మీదకు రావడం సంతోషంగా ఉందన్నారు. విదేశాలకు వెళ్లిన వారికి.. తెలుగుతో అనుబంధం తగ్గిపోతోందన్నారు. భారతదేశానికి ఐటీని తీసుకువచ్చి రాజీవ్‌గాంధీ మంచి బాటలు వేశారని గుర్తు చేశారు.
రాజీవ్‌గాంధీ వేసిన బాటను సీఎం చంద్రబాబు నాయుడితోపాటు మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కొనసాగించారని చెప్పారు. ఐటీ, ఫార్మా రంగంలో.. మన ప్రాధాన్యత ప్రపంచానికి తెలిసి వచ్చిందన్నారు. పాలిటిక్స్, సినిమా రంగంలో రాణించాలంటే తెలుగు భాష ఎంతో ఉపయోగమని చెప్పారు. నాలెడ్జ్ కోసం ఏ భాష నేర్చుకున్నా.. కానీ తెలుగు భాషను మాత్రం తక్కువ చేయొద్దని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలుగు సినీ రంగం హాలీవుడ్ స్థాయిలో ప్రభావం చూపడం శుభపరిణామని ఆయన వ్యాఖ్యానించారు.
మూడు దశాబ్దాల క్రితం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రపంచ తెలంగాణ సమాఖ్య ప్రారంభమైందని గుర్తు చేశారు. దేశంలోనే హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని చెప్పారు. దేశ రాజకీయాల్లో ఎంతో మంది తెలుగు వారు క్రియాశీలకంగా వ్యవహరించారంటూ నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్, వెంకటస్వామి, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు తదితరుల పేర్లను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
Also Read: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే
కానీ ప్రస్తుత దేశ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాభవం తగ్గిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయం, సినీ, వాణిజ్య రంగాల్లో రాణించినా మన భాషను మాత్రం మరిచి పోవద్దన్నారు. పర భాషా జ్ఞానం సంపాదించాలి… కానీ మన భాషను గౌరవించుకోవాలన్నారు. తెలుగును గౌరవిస్తూ ఈ మధ్య కాలంలో తమ ప్రభుత్వం జీవోలను ఈ భాషలోనే ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని వివరించారు.
Also Read: ప్రభుత్వంపై స్వామీజీల ధర్మాగ్రహం.. డిక్లరేషన్
Also Read: ఏబీ వేంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
తాను విదేశాల్లో పర్యటన సందర్భంగా... దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లిన సమయంలో ఎంతో మంది తెలుగు వారు తనను కలిశారని చెప్పారు. ఆయా దేశాల్లో స్థిరపడిన తెలుగు వారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని పిలుపు ఇచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Also Read: చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే
Also Read :సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా.. నిజంగా మీకు పండగలాంటి వార్త
తెలంగాణ రైజింగ్ నినాదంతో 2050 అభివృద్ధి ప్రణాళికలతో తాము ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. ప్రపంచంలో అత్యున్నత నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు సైతం సిద్దం చేస్తుందన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
For Telangana News And Telugu News