Share News

Komatireddy: రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Feb 20 , 2025 | 01:44 PM

Komatireddy: సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజలింగముర్తిని గండ్ర వెంకట రమణా రెడ్డి హత్య చేయించారని ఆరోపించారు.

Komatireddy: రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్
Minister komatireddy Venkatreddy

హైదరాబాద్, ఫిబ్రవరి 20: సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య (Rajalingamurthi Murder Case) ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister komatireddy Venkatreddy) స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాజలింగముర్తి హత్యపై సీబీసీఐడీతో విచారిస్తామని స్పష్టం చేశారు. ఈ హత్యపై పోలీసుల విచారణ జరుగుతోందని.. దోషులను 24 గంటల్లోనే పట్టుకుంటామని తెలిపారు. రాజలింగమూర్తి కేసును ఫాస్ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామని చెప్పారు. రాజలింగముర్తిని గండ్ర వెంకట రమణా రెడ్డి హత్య చేయించారన్నారు. దీని వెనక కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఉన్నారని ఆరోపించారు.


‘‘మీరు తెలంగాణలో ఎలా పుట్టారో అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదు. బీఆర్ఎస్ నేతలు హత్యా రాజకీయాలను మానుకోండి. దోపిడీని ప్రశ్నిస్తే హత్య చేసే స్థాయికి దిగజారారు. సామాజిక కార్యకర్త రాజలింగముర్తి హత్యను ఖండిస్తున్నాను’’ అని అన్నారు. మేడిగడ్డ అక్రమాలపై రాజలింగమూర్తి కోర్టులో పోరాడుతున్నాడని తెలిపారు. పదిమంది చిల్లరగాళ్లను రోడ్లపైకి వదిలారంటూ మండిపడ్డారు.

TG Govt: రాజలింగమూర్తి హత్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం


నీళ్లు పోసుకుని పెట్రోల్ అని చెప్పి అమాయకులు చనిపోవడానికి హరీష్ కారణం అయ్యారని దుయ్యబట్టారు. దోపిడి బయట పడుతుందని హత్యలు చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. అడ్వకేట్ వామన రావును హత్య చేసిన వాళ్ళకే కేసీఆర్ టికెట్ ఇచ్చారన్నారు. హరీష్ రావు మానవత్వం ఉన్న మనిషేనా అని ప్రశ్నించారు. రాజలింగమూర్తి హత్యను డైవర్ట్ చేసేందుకు హరీష్ రావు కృష్ణా నీళ్ల గురించి మాట్లాతున్నారన్నారు. శ్రీకాంత చారిని హరీష్ రావు చంపారన్నారు. ‘‘స్కాముల గురించి ప్రశ్నిస్తే చంపేస్తారా? 15 నెలల నుండి కేసీఆర్ ఈ ఎవరికైనా కనిపించాడా? కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని కేసీఆర్‌కు ఎలా తెలుసు? ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా భట్టి ఒంటరి పోరాటం చేశారు’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.


హత్య వెనక సుపారి: ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్ భూపాలపల్లి: మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగముర్తి హత్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. హత్యకు కారకులను వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించామని తెలిపారు. మేడిగడ్డ మీద ఫిల్ వేసిన వ్యక్తి హత్యపై సీబీసీఐడీ విచారణ జరగాలన్నారు. హత్యకు గల కారకులను కఠినంగా శిక్షించాలని అన్నారు. భూపాలపల్లిలో ఇలాంటివి జరిగితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. భూపాలపల్లిలో హత్యా రాజకీయాలు మంచిది కావన్నారు. హత్య వెనుక సుఫారి ఉందనేది తన వ్యక్తిగత భావనగా చెప్పుకొచ్చారు. వేరే వాళ్ళు హత్య చేసి వీరిని లొంగిపొమ్మని ఎవరైనా చెప్పారా? తేలాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

వైసీపీపై షాకింగ్ కామెంట్స్ చేసిన షర్మిల..

పీఎం కిసాన్ నిధులు పడేది ఆ రోజే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 20 , 2025 | 01:44 PM