Samatha Kumbh 2025 : సమతా కుంభ్ 2025 ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా ప్రారంభం.. ఎన్ని రోజుల వరకు అంటే..
ABN , Publish Date - Feb 10 , 2025 | 03:19 PM
హైదరాబాద్ : సమతా కుంభ్ 2025 తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా మాఘమాసంలో శ్రీ రామానుజాచార్యుల జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం నాడు 11 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈసారి శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి సమతా కుంభ్ ఆధ్యాత్మిక వేడుకలకు అంకురార్పణ చేశారు.

Samatha Kumbh 2025 : శ్రీరామనుజాచార్య-108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వికాస తరంగణి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక వేడుకలకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ప్రారంభించారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సమతా కుంభ్ యాత్రకు ఆదివారం ఫిబ్రవరి 9 న అంకురార్పణ చేశారు. ఏటా మాఘమాసంలో శ్రీ రామానుజాచార్యుల జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం నాడు 11 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
భగవంతుడి ముందు అందరూ సమానమే : చినజీయర్ స్వామి
సమతా కుంభ్ 2025 తృతీయ వార్షికోత్సవ వేడుకలు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఆదివారం మొదలయ్యాయి. ఐక్యత, సమానత్వ స్ఫూర్తికి ప్రతీకగా నిలబడాలనే ఉద్దేశంతో ముందుగా నెక్లెస్ రోడ్డులోని 125 అడుగుల విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం సమతా యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా 1927లోనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ శ్రీ రామానుజాచార్యులు చేపట్టిన సామాజిక సంస్కరణలను కొనియాడారని.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేశారని వ్యాఖ్యానించారు. అహంభావాన్ని విడనాడి అవసరం ఉన్నప్పుడు సమాజానికి మానవత్వంతో సేవలందించాలని పిలుపునిచ్చారు. వికాస తరంగణి నేతృత్వంలో జరుగుతున్న ఈ యాత్రలో వేలమంది భక్తులు పీపుల్స్ ప్లాజా వరకూ జై శ్రీమన్నారాయణ అని నినాదాలు చేస్తూ ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ పవిత్ర ఊరేగింపులో 100 బస్సులు పాల్గొన్నాయి.
11 రోజుల పాటు సమతా కుంభ్ వేడుకలు..
ఆదివారం ఆరంభమైన శ్రీ రామానుజాచార్య 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 వరకూ జరగనున్నాయి. ఫిబ్రవరి 10-13 తేదీల్లో సామాజిక సమానత్వం, జ్ఞానం, న్యాయం ప్రాధాన్యత తెలియజెప్పేందుకు విద్యాలయాలకు వెళ్లి విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేక సెషన్‌లు నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి..
Mastansai Case: మస్తాన్ సాయి కేసు.. ఏకంగా పోలీసులతోనే బేరసారాలు
Prajavani: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి
Sheesh Mahal: 'శీష్ మహల్'కు కొత్త సీఎం దూరం
మరిన్ని తెలుగు వార్తల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి..