Share News

Ponnam Prabhakar: కవితకు మంత్రి పొన్నం స్ట్రాంగ్ కౌంటర్

ABN , Publish Date - Jan 03 , 2025 | 04:44 PM

Telangana: కవిత గతంలో బతుకమ్మ, తర్వాత జాగృతి ఇప్పుడు బీసీ నినాదం అందుకున్నారని మంత్రి పొన్నం వ్యాఖ్యలు చేశారు. కొందరికి అధికారం మత్తు దిగి మస్తు గుర్తుకొస్తాయంటూ సెటైర్ విసిరారు. బీఆర్ఎస్ తమ పార్టీ పదవుల్లో బీసీలకు అవకాశమివ్వాలన్నారు. పార్టీ ఓనర్లలో తాను ఒకడిని అని ఈటెల రాజేందర్ అన్నందుకు మెడలు పట్టి బయటకి పంపారని విమర్శించారు.

Ponnam Prabhakar: కవితకు మంత్రి  పొన్నం స్ట్రాంగ్ కౌంటర్
Minister Ponnam Prabahakar

హైదరాబాద్, జనవరి 3: బీసీ డిక్లరేషన్‌కు సంబంధించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత BRS MLC Kavitha) చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీల కోసం మాట్లాడుతున్నందుకు సోదరి కవితకి అభినందనలు అని అన్నారు. నాయకత్వం మధ్య గ్యాప్ ఉందనే కవిత మీటింగ్ పెట్టారని వ్యాఖ్యలు చేశారు. కవిత గతంలో బతుకమ్మ, తర్వాత జాగృతి ఇప్పుడు బీసీ నినాదం అందుకున్నారన్నారు. కొందరికి అధికారం మత్తు దిగి మస్తు గుర్తుకొస్తాయంటూ సెటైర్ విసిరారు. బీఆర్ఎస్ తమ పార్టీ పదవుల్లో బీసీలకు అవకాశమివ్వాలన్నారు. పార్టీ ఓనర్లలో తాను ఒకడిని అని ఈటెల రాజేందర్ అన్నందుకు మెడలు పట్టి బయటకి పంపారని విమర్శించారు. కవిత చేసే పనికి కొంత సంతోషం, కొంత బాధ కలుగుతోందన్నారు. పదేండ్లలో బీసీల కోసం మాట్లాడని వాళ్లు ఈరోజు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు.


బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వకుండా తొక్కి పెట్టిన వాళ్లు ఈరోజు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మా పార్టీలో బలహీన వర్గాలకు అన్యాయమైతే పార్టీలో చర్చిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరిగితే మాట్లాడే అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. బీసీల శక్తి గుర్తించారు కాబట్టే కవిత బీసీ రాగం ఎత్తుకున్నారన్నారు. కవిత మీటింగ్‌కు జనాల కోసం బ్రతిమాలాడుతున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు.

MLC Kavitha: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాల్సిందే: ఎమ్మెల్సీ కవిత డిమాండ్..


ఎన్నికల సమయంలో తప్పా బీఆర్ఎస్ బీసీల కోసం ఏమైనా చేసిందా అని నిలదీశారు. ప్రగతి భవన్‌కు జ్యోతి రావ్ ఫూలే పేరు పెట్టుకున్నామని.. సావిత్రి భాయి ఫూలే జయంతిని మహిళా టీచర్ల దినంగా ప్రకటించామని తెలిపారు. కులగణన రిపోర్ట్ పబ్లిక్ డొమైన్‌లో పెడుతామని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎవరెంతో వారికి అంత అని రాహుల్ గాంధీ చెప్తున్నారన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం బీసీలను ఉపయోగించుకుంటే ఊరుకోమని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

అడ్డంగా దొరికేసిన సజ్జల..

నేటి నుంచి హైదరాబాదీలకు పండగే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 03 , 2025 | 04:44 PM