Electricity: ‘గృహజ్యోతి’తో పెరిగిన విద్యుత్ డిమాండ్
ABN , Publish Date - Jan 05 , 2025 | 12:38 PM
గ్రేటర్ పరిధిలోని 10 సర్కిళ్లలో 10.5 లక్షల మంది లబ్ధిదారులున్నారు. వారిలో గతంలో ప్రతీనెలా 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే లక్షల మంది కనెక్షన్‌దారులు గృహజ్యోతి అమలుతో ప్రతీనెలా 140-160 యూనిట్ల వరకు కరెంటు వినియోగాన్ని పెంచుకున్నారు.
గృహజ్యోతి జిరో బిల్లులతో గ్రేటర్‌లో విద్యుత్ డిమాండ్ పెరిగింది. చలికాలంలో సాధారణంగా డిమాండ్ తక్కువగా నమోదవుతుంటుంది. 2023లో గ్రేటర్ జోన్ వ్యాప్తంగా 50-55 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ డిమాండ్ నమోదవ్వగా, రెండు నెలలుగా రోజూ 60-65 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ డిమాండ్ నమోదవుతుంది.
హైదరాబాద్ సిటీ: గ్రేటర్ పరిధిలోని 10 సర్కిళ్లలో 10.5 లక్షల మంది లబ్ధిదారులున్నారు. వారిలో గతంలో ప్రతీనెలా 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే లక్షల మంది కనెక్షన్‌దారులు గృహజ్యోతి అమలుతో ప్రతీనెలా 140-160 యూనిట్ల వరకు కరెంటు వినియోగాన్ని పెంచుకున్నారు. బస్తీలు, కాలనీల్లో కొంతమంది వినియోగదారులు 180 యూనిట్ల వరకు కరెంట్ వినియోగిస్తుండడంతో విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది. గృహజ్యోతి పథకం ప్రారంభమైన మార్చి నెలలో పది సర్కిళ్లలో 8.71 లక్షల లబ్ధిదారులకు జీరో బిల్లులుండగా డిసెంబర్ నాటికి 10.52 లక్షల మందికి పెరిగింది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: త్వరలో అన్ని రాజకీయ పదవులు భర్తీ
గ్రేటర్ పరిధిలోని పది సర్కిళ్లలో అత్యధికంగా సంగారెడ్డి సర్కిల్‌లో 2.13 లక్షలమంది గృహజ్యోతి లబ్ధిదారులుండగా రాజేంద్రనగర్‌లో 1.33 లక్షలు, హబ్సిగూడ సర్కిల్(Habsiguda Circle)లో 1.28 లక్షలు, మేడ్చల్ సర్కిల్‌లో 1.15 లక్షలమంది వినియోగదారులు ఉన్నారు. అత్యల్పంగా బంజారాహిల్స్ సర్కిల్‌లో 36 వేల మంది, హైదరాబాద్ సెంట్రల్‌లో 68 వేలు, సికింద్రాబాద్(Secunderabad)లో 70 వేలు, సైబర్‌సిటీలో 73 వేలు, హైదరాబాద్ సౌత్‌లో 98 వేలమంది గృహజ్యోతితో జీరో బిల్లులు పొందుతున్నారు. గృహజ్యోతి లబ్ధిదారులు ఎక్కువ సంఖ్యలో ఉన్న సర్కిళ్లలో 2023 కంటే 2024లో 15-20 శాతం వరకు విద్యుత్ డిమాండ్ పెరిగింది.
ప్రతినెలా రూ. 100 కోట్ల లబ్ధి
గ్రేటర్‌లో ప్రతినెలా 10 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు సుమారు రూ.100 కోట్ల వరకు గృహజ్యోతి పథకంతో లబ్ధిపొందుతున్నారని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతినెలా 200 యూనిట్లకు వచ్చే బిల్లు రూ.1150 - 1200 వరకు ఉంటుంది. వాటిలో ఎనర్జీ చార్జీలు, కస్టమర్ చార్జీలతో పాటు ఎలక్ర్టిసిటీ డ్యూటీ ఇతర చార్జీలుంటాయి.
గృహజ్యోతి పథకం ప్రారంభం నుంచి నవంబరు పూర్తినాటికి 94 లక్షలా 71 వేల మంది జీరో బిల్లులతో లబ్ధిపొందినట్లు అధికారులు చెబుతున్నారు. గృహజ్యోతి కారణంగా ఫిబ్రవరి, మార్చి నుంచి విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశముంటుందని విద్యుత్‌శాఖ అంచనా వేస్తోంది. వేసవిలో నమోదయ్యే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి మొదటి వారం కల్లా సమ్మర్‌యాక్షన్ ప్లాన్‌లో భాగంగా చేపట్టిన పనులు పూర్తిచేయాలని విద్యుత్‌శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈవార్తను కూడా చదవండి: ‘తెలుగు‘లో చదివితే ఉద్యోగాలు రావన్నది అపోహే
ఈవార్తను కూడా చదవండి: KTR: కేంద్రంలో చక్రం తిప్పుతాం
ఈవార్తను కూడా చదవండి: DK Aruna: చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాలి
ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం అభివృద్ధిపై మంత్రి తుమ్మల కీలక నిర్ణయాలు
Read Latest Telangana News and National News