Share News

Hyderabad: సెల్లార్‌ స్లాబ్‌ పూర్తయ్యే వరకు అనుమతులు లేవని తెలియదట..

ABN , Publish Date - Feb 07 , 2025 | 07:49 AM

ఎల్బీనగర్‌ సర్కిల్‌(LB Nagar Circle) పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌లోని గ్రీన్‌పార్క్‌కాలనీ సమీపంలో ప్రధాన రహదారిపై ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన సెల్లార్‌ స్లాబ్‌కు టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది గురువారం రంధ్రాలు చేశారు.

Hyderabad: సెల్లార్‌ స్లాబ్‌ పూర్తయ్యే వరకు అనుమతులు లేవని తెలియదట..

- తీరిగ్గావచ్చి రంధ్రాలు చేసిన టౌన్‌ప్లానింగ్‌ అధికారులు

హైదరాబాద్: ఎల్బీనగర్‌ సర్కిల్‌(LB Nagar Circle) పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌లోని గ్రీన్‌పార్క్‌కాలనీ సమీపంలో ప్రధాన రహదారిపై ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన సెల్లార్‌ స్లాబ్‌కు టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది గురువారం రంధ్రాలు చేశారు. 1215 గజాల స్థలంలో ఎనిమిది నెలలుగా భారీ ఎత్తున సెల్లార్‌ గుంత తవ్వి సెల్లార్‌ స్లాబుల నిర్మాణం పూర్తిచేసి గ్రౌండ్‌ ఫ్లోర్‌ పిల్లర్ల నిర్మాణం చేపట్టేంత వరకు కూడా నిర్మాణ అనుమతులు లేవన్న విషయం స్థానిక టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు తెలియకపోవడం గమనార్హం.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఎండీఎంఏ డ్రగ్స్‌, ఓజీ కుష్‌ గంజాయి పట్టివేత


జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం(GHMC Enforcement Department) ఆదేశించే వరకు ఇంత పెద్ద అక్రమ నిర్మాణం స్థానిక అధికారులకు కనిపించకపోవడం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఎల్బీనగర్‌ టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ ప్రతాప్‌ ఆధ్వర్యంలో సిబ్బంది అక్రమంగా నిర్మించిన సెల్లార్‌ స్లాబ్‌కు రంధ్రాలు చేసి మమ అనిపించారు.


ఎన్‌పోర్స్‌మెంట్‌ విభాగం ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేదిలేదని ఆయన స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టి నష్టపోవద్దని ఆయన సూచించారు. అక్రమ కట్టడాల వెనుక ఎంతటివారున్నా కొంత సమయం ఆలస్యం కావచ్చు కానీ కూల్చివేయడం మాత్రం ఖాయమన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Mettuguda: ఇంట్లో తల్లి, తనయుడికి కత్తిపోట్లు

ఈవార్తను కూడా చదవండి: Peddapalli: మొదట పరిషత్‌ ఎన్నికలకే మొగ్గు

ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర

ఈవార్తను కూడా చదవండి: బస్సు టైరు పేలి ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 07 , 2025 | 07:49 AM