Share News

ఆర్మీ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:28 AM

ఆర్మీ రిక్రూట్‌ మెంట్‌ టెస్టులో ఉత్తీర్ణతను సాధించేందుకు అందిస్తున్న ఉచిత శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం సెంటినరీకాలనీలోని రాణిరుద్రమదేవీ స్టేడియంలో ఆర్మీ రిక్యూమెంట్‌ రాత పరీక్షకు ఆసక్తి కలగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు చేపట్టిన కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.

ఆర్మీ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

రామగిరి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఆర్మీ రిక్రూట్‌ మెంట్‌ టెస్టులో ఉత్తీర్ణతను సాధించేందుకు అందిస్తున్న ఉచిత శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం సెంటినరీకాలనీలోని రాణిరుద్రమదేవీ స్టేడియంలో ఆర్మీ రిక్యూమెంట్‌ రాత పరీక్షకు ఆసక్తి కలగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు చేపట్టిన కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.

ఆయన మాట్లాడుతూ అగ్నివీర్‌ ద్వారా ఇండియన్‌ ఆర్మీ వింగ్‌లోకి రిక్రూట్‌మెంట్‌ కోసం నోటిఫికేషన్‌ విడుదలు కాగా జిల్లాలో అర్హత, ఆసక్తి గల అభ్యర్థులకు రాత పరీక్ష, దేహదారుడ్య శిక్షణను అందించ ానికి చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి ఆసక్తిగల 359మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించామన్నారు. వారికి స్టేడియంలో రిటైర్డ్‌ ఆర్మీ జవాన్ల పర్యవేక్షణలో రన్నింగ్‌, మెడికల్‌, ఇతర ఫిజికల్‌ టెస్టులు నిర్వహించామన్నారు. అర్హత సాధించిన వారికి 2 నెలల పాటు వసతితో కూడిన శిక్షణ ఇస్తామన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవా లన్నారు. జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌రెడ్డి, యువజన క్రీడాధికారి సురేష్‌, ఏసీపీ రమేష్‌, మిలట్రీ జవాన్‌ మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎంపికైన యువకులకు సన్మానం

సుల్తానాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): యువత సైనిక విభాగాలలో చేరడానికి శిక్షణ పొందడం గర్వకారణమని సుల్తానాబాద్‌ స్పోర్ట్స్‌క్లబ్‌ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్‌, ప్రధాన కార్యదర్శి అమిరిశెట్టి తిరుపతి అన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో శుక్రవారం శిక్షణకు ఎంపికై యువకులు ఎలవేణి గణేష్‌, కౌడగాని రాజేశ్‌, శీలం అభినయ్‌ వర్మలను సన్మానించారు. పీఈటీలు కల్వల వెంకటేశ్‌, రాకేష్‌, ఖేలో ఇండియా కోచ్‌ గెల్లు మధుకర్‌, ఆకుల అజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:28 AM