Share News

రైతు సంఘాల నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:31 AM

రైతు సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసు లను ఎత్తివేయాలని, ప్రజా సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని సంయుక్త కిసా న్‌ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర సన చేపట్టారు.

 రైతు సంఘాల నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి

పెద్దపల్లిటౌన్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రైతు సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసు లను ఎత్తివేయాలని, ప్రజా సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని సంయుక్త కిసా న్‌ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర సన చేపట్టారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం నాయకులు మాట్లా డుతూ కేంద్రంలోని మోదీ సర్కార్‌ ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాల న్నారు. పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధించిన రైతు సంఘాల నాయకులను విడుదల చేయాల న్నారు. రైతంగాన్ని మోసం చేసే కల్తీ విత్తనాల, పురుగుల మందుల సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెళ్తురు సదానందం, గుమ్మడి వెంకన్న, రైతు సామస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు మల్లన్న బీమన్నా, మెర్గు చంద్రయ్య, రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ తాండ్ర సదానందం, తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ జిల్లా కన్వీనర్‌ గుమ్మడి కొమురయ్య, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె. విశ్వనాథ్‌, మాస్‌ లైన్‌ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్‌, టి.రత్నకుమార్‌, పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:31 AM