Share News

పట్టణాభివృద్ధికి కృషి చేయాలి

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:08 AM

మున్సిపల్‌ ఆదాయాన్ని పెంచుకొని పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మం గళవారం కలెక్టరేట్‌లో రామగుండం కార్పొరేషన్‌, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీల బడ్జెట్‌ తయారీపై అదనపు కలెక్టర్‌ అరుణశ్రీతో కలిసి సమీక్ష నిర్వహించారు.

పట్టణాభివృద్ధికి కృషి చేయాలి

పెద్దపల్లి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఆదాయాన్ని పెంచుకొని పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మం గళవారం కలెక్టరేట్‌లో రామగుండం కార్పొరేషన్‌, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీల బడ్జెట్‌ తయారీపై అదనపు కలెక్టర్‌ అరుణశ్రీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్‌ ఆదాయ వనరులపై కౌన్సిల్‌ సమావేశంలో చర్చించి ఆదాయాన్ని పెంచు కునేందుకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారించాలన్నారు.

మున్సిపల్‌ పరిధిలో ఆదాయాన్ని పెంచుకున్నప్పుడే వార్డులు డివిజన్లలో మరింత అభి వృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. వంద శాతం పన్నుల వసూలుకు ప్రణా ళిక సిద్ధం చేయాలని కలెక్టర్‌ అన్నారు. పట్టణాలలో ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు అవసరమైన చోట అసెస్మెంట్‌ చేయాలని కలెక్టర్‌ సూచిం చారు. వ్యయాలు తగ్గించుకుంటూ, ఆదాయాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అందుబాటులో ఉండే విధంగా కృషి చేయాలన్నారు. కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 12:08 AM